తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ ఈశ్వరుడే ఈ భైరవుడు! ఇంతటి సక్సెస్‌ ప్రభాస్‌కి మాత్రమే సాధ్యం! - Kalki 2898 AD - KALKI 2898 AD

Prabhas Kalki 2898 AD : ఇటీవలే 'సలార్‌'గా అలరించిన ప్రభాస్‌, ఇప్పుడు 'కల్కి'లో భైరవగా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ సొంతం చేసుకున్న 'బాహుబలి' గురించి కొన్ని ప్రత్యేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Prabhas Kalki 2898 AD
Prabhas Kalki 2898 AD (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 26, 2024, 9:33 PM IST

Prabhas Kalki 2898 AD :సినిమా ఇండస్ట్రీలో ఉండగలనా అనుకున్న వ్యక్తి, ఇప్పుడు ప్రపంచానికే తెలుగు సినిమాని పరిచయం చేశారు. చాలా తక్కువగా మాట్లాడుతారు, కానీ ఆయన సినిమా వస్తే ఇండియా మొత్తం హోరెత్తిపోతుంది. ఆయన మన డార్లింగ్ ప్రభాస్​. ఈ స్టార్ హీరో లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా శుక్రవారం (జూన్​ 27) రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ 'బాహుబలి' గురించి కొన్ని ప్రత్యేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాన్‌ ఇండియా ట్రెండ్‌ మొదలు
సినిమాల్లోకి ప్రభాస్‌కి ఈజీగా ఎంట్రీ దొరికినా, స్టార్‌ అవ్వడానికి చాలా కాలం పట్టింది. తొలి సినిమా 'ఈశ్వర్‌' చేస్తున్నప్పుడు, ఇండస్ట్రీలో నేను ఉండగలనా? అని భయపడిన వ్యక్తి, ఇప్పుడు సినీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నారు. 2002లో 'ఈశ్వర్‌' రిలీజ్‌ అయింది, ప్రభాస్‌కి ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. రెండో సినిమా ‘రాఘవేంద్ర’ సైతం సక్సెస్‌ అవ్వలేదు. మూడో సినిమా 'వర్షం'తో ప్రభాస్‌కి హిట్‌ పడింది. ఆ తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది.

ఇక నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా చేయాలని, కృష్ణ వంశీని ఒప్పించి 'చక్రం' చేశారు. కథను, డైరెక్టర్​ను నమ్మితే ఒక్క సినిమా కోసం ఆరేళ్ల సమయాన్నైనా ఇవ్వడానికి ఆలోచించరు. ప్రభాస్‌ కాకపోతే మరొకరితో 'బాహుబలి' సాధ్యం కాకపోయేదేమో! ప్రభాస్‌ కృషితోనే దేశంలో పాన్‌ ఇండియా ట్రెండ్‌ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతి వ్యాపించిందంటూ ఇప్పటికీ ఫ్యాన్స్ కొనియాడుతుంటారు.

స్టార్‌ డైరెక్టర్‌ కాకపోయినా ఓకే!
'బాహుబలి'తో అంతర్జాతీయంగానూ ప్రభాస్ క్రేజ్‌ మరింత పెరిగింది. ఆ తర్వాత అందరి అంచనాలు తలకిందులు చేస్తూ యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌తో 'సాహో' చేశారు. ఆ తర్వాత అంతగా ఎక్స్‌పీరియన్స్‌ లేని డైరెక్టర్​ రాధాకృష్ణ కుమార్‌కు ఛాన్స్‌ ఇచ్చారు. ఆయనతో తీసిన 'రాధే శ్యామ్‌' అంచనాలు అందుకోలేకపోయింది. ఇక బాలీవుడ్‌ డైరెక్టర్ ఓం రౌత్‌తో చేసిన 'ఆదిపురుష్‌' కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది.

అయితే ప్రశాంత్‌ నీల్‌తో చేసిన 'సలార్'తో ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు ప్రభాస్. ఇప్పుడు 'కల్కి'తో ముందుకొస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌కి కూడా రెండు సినిమాల అనుభవమే ఉంది.

మరోవైపు, మారుతి రూపొందిస్తున్న'రాజా సాబ్‌'లోనూ ప్రభాస్​ నటిస్తున్నారు. 'కన్నప్ప'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో 'స్పిరిట్‌' చేయనున్నారు. 'సలార్‌ 2' త్వరలోనే పట్టాలెక్కనుంది.

అందుకే తక్కువ మాటలు
సక్సెస్‌ వస్తే పొంగిపోవడం, లేకుంటే కుంగిపోవడం ప్రభాస్‌కి తెలియదు. ఫలితం ఏదైనా సరే తన ఫోకస్ అంతా నెక్స్ట్‌ ప్రాజెక్ట్​పైనే ఉంటుంది. తక్కువగా మాట్లాడుతారు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. కొంతమంది స్నేహితులు, బంధువుల మధ్యే ఈ యాక్టర్‌ బాల్యం గడిచిపోయింది. బయటి వారిని చూసింది తక్కువ. అందుకే కొత్త వ్యక్తుల ముందుకొచ్చినా, కొత్త ప్రదేశమైనా మాట్లాడేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు.

అందుకే 'కల్కి' చిత్రాన్ని ఒప్పుకున్నాను : కమల్​ హాసన్​ - Kalki 2898 AD Movie

దీపికా డెబ్యూ తెలుగు సినిమా 'కల్కి 2898 AD' కాదు? ఏదో తెలుసా? - Kalki 2898 AD Movie

ABOUT THE AUTHOR

...view details