Prabhas Hanu Raghavapudi Movie : రెబల్ స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషనలో గతంలో ఓ సినిమా రానున్న విషయం తెగ వైరల్ అయ్యింది. అయితే నేడు ఆ విషయం కన్ఫార్మ్ అయిపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ తాజాగా సోషల్ మీడియాలో ఈ న్యూస్‌ను రివీల్ చేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమానికి చిత్రబృందం హాజరై సందడి చేసింది. ముఖ్యంగా ప్రభాస్ న్యూ లుక్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
అయితే ఈ సినిమా ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్‌ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాట టాక్. ఇక విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సుదీప్ ఛటర్జీ కెమరా బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రభాస్ హీరోయిన్ ఆమెనే!
తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో ఓ అమ్మాయి తెగ సందడి చేసింది. మూవీ టీమ్‌లో భాగంగా ఫొటోలు కూడా దిగింది. చూడటానికి ఆమె కొత్తగా కనిపించటంతో ఈమె ఎవరా అంటూ నెటిజన్లు తన గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేశారు. అయితే ఆమె పేరు ఇమాన్ ఇస్మాయిల్. ప్రొఫషన్ డ్యాన్సర్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈమె నెట్టింట పోస్ట్ చేసే పలు రీల్స్ చాలా ట్రెండ్ అయ్యాయి.