తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆపద్బాంధవుడు అన్నయ్య'- చిరుకు మెగా బ్రదర్స్​ స్పెషల్ విషెస్ - Chiranjeevi Pawan Kalyan - CHIRANJEEVI PAWAN KALYAN

Chiranjeevi Pawan Kalyan: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తమ్ముళ్లు నాగబాబు, పవన్​ కల్యాణ్​ సహా పలువురు సెలబ్రిటీలు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Chiranjeevi Pawan Kalyan
Chiranjeevi Pawan Kalyan (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 10:29 AM IST

Chiranjeevi Pawan Kalyan:మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య చిరంజీవికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఆయన దృష్టిలో చిరంజీవి 'ఆపద్బాంధవుడు' అన్నారు. 'నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు, అభ్యర్ధిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో!

గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో రూ.ఐదు కోట్ల విరాళాన్ని జనసేనకు అందజేసి విజయాన్ని అందుకోవాలని మా ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారు. ఆయన ఆ రోజు ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తల్లిలాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుడిని మనసారా కోరుకుంటున్నా' అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇక మెగాస్టార్ బర్త్​డే సందర్భంగా 'ఇంద్ర' సినిమాతో థియేటర్లలో సందడి నెలకొనగా, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్​లు షేర్ చేస్తున్నారు.

  • ఆగస్టు 22 మెగా ఫ్యాన్స్‌ డే. మా అందరికీ తండ్రిలా ఉండి మమ్మల్ని ఉన్నతస్థానంలో నిలబెట్టారు. మాకు జీవితాన్నిచ్చిన మా అన్నయ్యకు మేము ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు - నాగబాబు
  • మన మెగాస్టార్‌ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు - అల్లు అర్జున్‌
  • నా ప్రియమైన బాస్‌ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు - వశిష్ఠ
  • హ్యాపీ బర్త్‌డే మై ఫ్రెండ్‌. నువ్వు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా - వెంకటేశ్‌
  • అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ, వన్‌ అండ్‌ ఓన్లీ మెగాస్టార్‌. హ్యాపీ బర్త్‌డే మై బాస్‌ - హరీశ్‌ శంకర్‌
  • నా సుప్రీమ్‌ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీలాగే ప్రజలకు సేవ చేయాలని చూస్తున్నాను పెద్ద మామయ్య. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా - సాయి దుర్గా తేజ్‌
  • పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. విశ్వంభరను థియేటర్‌లలో చూడడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా - శ్రీకాంత్‌
  • నిత్య ప్రజాకర్షకుడికి జన్మదిన శుభాకాంక్షలు. మీ నటనతో టాలీవుడ్‌పై చెరగని ముద్ర వేశారు. రానున్న సంవత్సరాలు మీకు మరింత విజయాన్ని అందించాలి - గోపీచంద్‌ మలినేని

ABOUT THE AUTHOR

...view details