Pooja Hegde Kanchana 4 : టాలీవుడ్లో నాలుగేళ్ల క్రితం వరకు వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన పూజా హెగ్డేకు ప్రస్తుతం ఛాన్స్‌లు ఏమీ లేవు. ఆ మధ్య తెలుగు, తమిళంలో వరుసగా ఫ్లాప్‌లు రావడంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్‌తో కలిసి కిసీకా భాయ్ కిసీకా జాన్ చేయగా అది కాస్త బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.
అయితే పూజా హెగ్డేకు మరో సినిమా ఛాన్స్ వచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకే కథను కాస్త అటు ఇటు మార్చి చూపించే కాంచన సిరీస్‌లో ఆమె అవకాశం దక్కినట్లు టాక్ వినిపిస్తోంది. కాంచన 4 కోసం ఈ ముద్దుగుమ్మను సంప్రదించారని ప్రచారం మొదలైంది. ఒకవేళ లారెన్స్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొత్త రూట్ తీసుకున్నట్టు అవుతుంది. ఇప్పటికే త్రిష, హన్సిక, రాశిఖన్నా, తమన్నా లాంటి గ్లామర్ హీరోయిన్స్ హారర్ సినిమాల్లో నటించి హిట్స్‌ను అందుకున్నారు. మరి పూజా హెగ్డేకు కూడా ఈ హారర్ ఫార్ములా ఏమైనా సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.
ఇకపోతే ఈ కాంచన 4 సినిమా కోసం ప్రముఖ బాలీవుడ్ సంస్థ గోల్డ్ మైన్స్ రూ.100 కోట్లకుపైగా బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమైందట. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైందని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు చంద్రముఖి 2తో భారీ డిజాస్టర్ అందుకున్న లారెన్స్ ఈ కాంచన 4తో తన స్వీయ దర్శకత్వంలో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు.