తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

షాకింగ్ : బాయ్​ఫ్రెండ్ తల పగలగొట్టిన పాయల్ రాజ్​పుత్​! - payal rajput broke boyfriend head

Payal Rajput Broke Boyfriend Head : టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్​పుత్ ప్రస్తుతం సోషల్​ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె బీర్ సీసాతో తన బాయ్​ ఫ్రెండ్ తల పగులగొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

షాకింగ్ : బాయ్​ఫ్రెండ్ తల పగలగొట్టిన పాయల్ రాజ్​పుత్​!
షాకింగ్ : బాయ్​ఫ్రెండ్ తల పగలగొట్టిన పాయల్ రాజ్​పుత్​!

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 1:54 PM IST

Payal Rajput Broke Boyfriend Head : టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్​పుత్​ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. RX 100 చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్​గా మారిన ఈ హాట్ బ్యూటీ - మూవీలో మరింత బోల్డ్‌గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్​ కాలేకపోయింది. అయితే రీసెంట్​గా మంగళవారం చిత్రంలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఓ భారీ హిట్​ను ఖాతాలో వేసుకుంది. ఇందులో ఆమె నటనకు అంతా ఫిదా అయిపోయారు. తనపై ప్రశంసలు కురిపించారు.

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్​ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్​ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆమె తన వాలంటైన్స్‌ డే ఎలా, ఎక్కడ జరుపుకుందో తెలుపుతూ ఓ వీడియోను ఆమె పోస్ట్ చేసింది. అందులో ఆమె ప్రియుడు సౌరబ్‌తో కలిసి పబ్‌లో గడిపింది. అయితే అక్కడ ఓ షూట్​లో భాగంగా ప్రియుడి తలపై బీర్ బాటిల్‌తో కొట్టింది.

ఈ వీడియోను సోషల్​ మీడియాలో షేర్ చేస్తూ నా వాలంటైన్స్ డేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరేలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్పండి అంటూ క్యాప్షన్ రాసి పోస్ట్ చేసింది. దీనికి ఓ నెటిజన్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. మళ్లీ ఓ సారి అలానే ట్రై చేయండి అంటూ కామెంట్ పెట్టగా దానికి సౌరబ్ అది ఒక బ్యాడ్ ఐడియా అంటూ బదులిచ్చాడు. పాయల్ నిన్న వాలంటైన్స్​ డే రోజు పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకొద్దు అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పాయల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాల కోసం రెడీ అవుతోంది. వాటికి సంబంధించిన అప్డేట్స్​ ఇంకా రాలేదు.

నెట్​ఫ్లిక్స్ చేతిలో టాలీవుడ్ బడా హీరోలు- మిగతా ఓటీటీలకు పోటీ తప్పదా?

తారక్ లైనప్​ - ఫుల్ కన్ఫ్యూజన్​ బాస్!

ABOUT THE AUTHOR

...view details