తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వీరమల్లు రిలీజ్ డేట్ ఇదే - చిక్కుల్లో పడ్డ ఓజీ - Pawankalyan - PAWANKALYAN

Pawankalyan Hari Hara Veeramallu Release Date : పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు రిలీజ్ డేట్​తో పాటు ఓజీ రిలీజ్ డేట్​ గురించి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

hari hara veeramallu
hari hara veeramallu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 12:30 PM IST

Pawankalyan Hari Hara Veeramallu Release Date :పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్​కు ఈ ఏడాది ఎన్నికల పండగతో పాటు మరో రెండు పండగలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఓజీ ఈ ఏడాది సెప్టెంబర్​లో విడుదల కానుందని సమాచారం. తాజాగా టీజర్ విడుదలైన హరి హర వీరమల్లు మూవీ కూడా ఈ ఏడాది రిలీజ్ అవుతుందని అంటున్నారు. అయితే రెండు చిత్రాల విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదు.

వీరమల్లు విషయానికి వస్తే ఇప్పటివరకు క్రిష్ ఆ మూవీ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇకపై దర్శకత్వ బాధ్యతలు కొత్త దర్శకుడు జ్యోతి కృష్ణ తీసుకుంటారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20 లేదా ఆపైన క్రిస్టమస్​కు విడుదల కావొచ్చనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఎన్నికల సందడి ముగిసిన తర్వాత మిగిలిన షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఓజి చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మొదట ఏప్రిల్ 3 న విడుదల అవుతుందని అన్నారు. కానీ ఆ తర్వాత సెప్టెంబర్ 27న విడుదల కానుందని ప్రచారం చేశారు. అయితే ఓటీటీ డీల్ లో జాప్యం కారణంగా ఆ తేదీకి సినిమా విడుదల అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. భారీ హైప్ ఉన్న ఈ చిత్రానికి ఓటీటీ డీల్ ఇప్పటివరకు కాకపోవడం ఫ్యాన్స్​ను ఆశ్చర్యానికి గురి చేసింది. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో ప్రధాన పాత్రలో శ్రీలీల కూడా నటిస్తుందని సమాచారం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details