Patriotic Songs In Telugu : బ్రిటిష్ దొరల పాలన నుంచి విముక్తి పొంది 78వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దేశభక్తి గీతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేజర్ చంద్రకాంత్, అల్లూరి సీతారామరాజు, ఖడ్గం, ఆర్ఆర్ఆర్ వంటి తెలుగు సినిమాల్లో వచ్చిన కొన్ని దేశభక్తి గీతాలేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
'పుణ్యభూమి నా దేశం నమో నమామి'
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం మేజర్ చంద్రకాంత్. ఈ చిత్రంలో 'పుణ్యభూమి నా దేశం నమో నమామి- ధన్య భూమి నా దేశం సదా స్మరామి' అనే పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ పాటలో రచయిత దేశం, స్వాతంత్ర్య సమరయోధుల గురించి చక్కగా వివరించి శ్రోతల్లో దేశభక్తిని ఇనుమడింపజేశారు.
'తెలుగు వీర లేవరా- దీక్ష బూని సాగరా'
సూపర్ కృష్ణ హీరోగా తెరకెక్కిన అల్లూరి సీతారామరాజు సినిమాలోని 'తెలుగు వీర లేవరా- దీక్ష బూని సాగరా' పాట ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. దేశ ఔనత్యాన్ని, ధైర్యం గురించి చెబుతూ సాగుతుందీ పాట.
'మేమే ఇండియన్స్'
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖడ్గం' సినిమాలోని మేమే ఇండియన్స్ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మతాల వేరైనా అందరం భారతీయులమనే అర్థం వచ్చేటట్లు సాగుతుంది ఈ పాట. మేమే ఇండియన్స్ అంటూ సాగే ఆ పాట స్వాతంత్ర్యం దినోత్సవం నాడు ఎక్కువగా వినిపిస్తుంటుంది.