తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దేవర భార్య - మరాఠీ బ్యూటీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? - shrumarathe Devara - SHRUMARATHE DEVARA

NTR Devara shrumarathe :యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీలో మరాఠీ బ్యూటీ శ్రుతి మరాఠే నటిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. మరి ఈ మరాఠీ బ్యూటీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా?

దేవర భార్య -  మరాఠీ బ్యూటీ గురించి ఈ విషయాలు తెలుసా?
దేవర భార్య - మరాఠీ బ్యూటీ గురించి ఈ విషయాలు తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 12:07 PM IST

NTR Devara Marathi Heroine shrumarathe : ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ నటిస్తోన్న దేవర మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ మూవీలో తారక్ సరికొత్త లూక్​లో కనిపించనున్నారు. ఈ మధ్యే విడుదలైన పోస్టర్ మూవీపై మరింత హైప్ పెంచింది. ఇక ఈ మూవీలో జాన్వీకపూర్ తో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మరాఠీ, తమిళంలో ఎన్నో సినిమాలు చేసిన గుజరాతీ బ్యూటీ శ్రుతి మరాఠే దేవర మూవీలో కీ రోల్​లో నటిస్తోంది. దీంతో రెండు మూడు రోజుల నుంచి ఈమె తెగ ట్రెండ్ అవుతోంది.

దేవర మూవీ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది శ్రుతి. ఈ మూవీలో దేవరకు భార్యగా కనిపిస్తానంటూ రీసెంట్​గానే సోషల్ మీడియాలో చెప్పింది. గుజరాత్​లో జన్మించిన ఈ అమ్మడు మోడల్​గా తన కెరీర్​ను ప్రారంభించింది. మరాఠీలో సనాయ్ ఛౌఘడేతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత హిందీ, తమిళ, మరాఠీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. వెండితెరకు రాకముందు ఈ అమ్మడు బుల్లితెరపైనా సీరియళ్లు, టీవీ షోలతో చాలా ఫేమస్ అయ్యింది. బార్డ్ ఆఫ్ బ్లడ్ అనే వెబ్ సిరీస్​లోనూ యాక్ట్ చేసి మెప్పింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్​లోనూ తానేంటో నిరూపించుకున్న శ్రుతికి టాలీవుడ్​లో దేవరనే మొదటి సినిమా అవ్వడం విశేషం. ఇక పండగ సమయాల్లో శ్రుతి తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడుపుతుందట. అంతేకాదు తనకు విహార యాత్రలు కూడా చాలా ఇష్టమట. ఎక్కువగా బోటింగ్ అంటే మక్కువ అని చెబుతోంది ఈ భామ. షూటింగ్ నుంచి ఏ కాస్త సమయం దొరికినా తన కుటుంబంతో ట్రిప్ ప్లాన్ చేస్తుందట. మోడ్రన్ డ్రెస్సులతో మత్తేక్కించే ఈ బ్యూటీకి చీరకట్టు అంటే చాలా ఇష్టమని చెబుతోంది. అందులోనూ మరాఠీ స్టైల్​లో ఎర్ర అంచు తెలుపు చీరలు తన ఫేవరేట్ అట. ఇన్ స్టాగ్రామ్ లోనూ ఈ బ్యూటీ వైట్ శారీతో దిగిన ఎన్నో ఫోటోలను షేర్ చేసింది. అంతేకాదు ఇంట్లో వాళ్లతో కలిసి రీల్స్ చేస్తూ ఈ వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంది. తన ఇన్ స్టా అకౌంట్​కు 13లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details