Nitesh Tiwari Ramayan :బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'రామాయణ్'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇందులో నటించనున్న స్టార్స్ నుంచి ఈ సినిమా బడ్జెట్ వరకు అన్ని ఈ సినిమా భారీ అంచనాలు పెంచుతున్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నట్లు తెలియగానే ఫ్యాన్స్ మరింత ఎగ్జైటెడ్గా ఫీలయ్యారు. అయితే ఈ సినిమా గురించి మేకర్స్ ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు. అంతే కాకుండా ఇందులో నటిస్తున్న వారి గురించి కూడా రోజుకో వార్త వస్తుండటం వల్ల సినీ లవర్స్ అందరూ మేకర్స్ త్వరగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే బాగున్ను అని ఫీల్ అవుతున్నాయి.
తాజాగా ఇదే విషయం గురించి చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు ఓ తాజా అప్డేట్ను ట్రెండ్ చేస్తున్నారు. దాని ద్వారా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ను మేకర్స్ శ్రీ రామ నవమి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే 'రామాయణ్' సినిమా నటీనటులు ఈ సినిమా టెక్నికల్ అప్డేట్స్ ఇలా పలు అంశాల గురించి మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.