తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'షూటింగ్​లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తా' - బాలయ్య NBK109 భామ - NBK 109 Heroine Chandini Chowdary

NBK 109 Chandini Chowdary : తెలుగమ్మాయి చాందిని చౌదరి షూటింగ్ సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తినట్లు గుర్తుచేసుకుంది. గామి మూవీ షూటింగ్​లో ఈ ఘటన ఎదురైనట్లు చెప్పుకొచ్చింది. ఆ వివరాలు

Etv Bharat
'షూటింగ్​లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తా' - బాలయ్య NBK109 భామ

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 8:04 AM IST

NBK 109 Chandini Chowdary :టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు అంతగా స్కోప్ ఉండదన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా పరభాష కథానాయికలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇంత పోటీలోనూ అచ్చ తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతూ కెరీర్​లో ముందుకెళ్తోంది. షార్ట్‌‌ ఫిలిమ్స్​తో కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్‌‌గా మంచి పేరు తెచ్చుకుంది చాందిని. ప్రేమ ప్రేమ, ట్రూ లవ్, మధురం, సాంబార్ ఇడ్లి వంటి షార్ట్ ఫిలిమ్స్​తో ఆకట్టుకుని ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చేసింది తక్కువ చిత్రాలే అయినా కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్​లను ఎంచుకుని క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 109 చిత్రంలోనూ ఛాన్స్ అందుకుంది. ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే త్వరలోనే ఈ భామ గామి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ షూటింగ్​ సమయంలో తాను చావు చివరి అంచుల వరకు వెళ్లినట్లు తెలిపింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తినట్లు గుర్తుచేసుకుంది.

"గామి మూవీ జర్నీ అంతా ఓ అడ్వెంచర్​లా సాగింది. నేను ఈ ప్రాజెక్ట్‌ మొదటి రోజు నుంచి ఉన్నాను. ఈ మూవీ షూటింగ్ వారణాసి, కశ్మీర్‌, హిమాలయాలు ఇలా ఎన్నో రియల్‌ లొకేషన్స్‌లో చేశారు. కుంభమేళలో అఘోరాల మధ్య కూడా షూటింగ్ చేశాం. ముఖ్యంగా హిమాలయాల్లో షూటింగ్ చేసేటప్పుడు చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. మా టీమ్‌ మొత్తంలో నేను ఒక్కదాన్నే ఆడపిల్లను. అందరం ఒకే బస్సులో హిమాలయాల్లోకి వెళ్లి సూర్యాస్తమయం వరకు చిత్రీకరణ చేసి తిరిగి వచ్చే వాళ్లం. అక్కడ వాష్‌ రూమ్స్‌ కూడా ఉండవు. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు కూడా తాగేదాన్ని కాదు. అలా నెల రోజులు షూట్‌లో పాల్గొన్నాను. గడ్డ కట్టిన నదిపై చిత్రీకరణ జరుపుతున్నప్పుడైతే మంచు ఫలకాల మధ్య పగుళ్లు ఏర్పడింది. నదిలో పడే పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో నేను నా దగ్గర ఉన్న బరువైన లగేజ్‌ను దూరంగా విసిరేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ బయటకు దూకేశాను. ఇలా షూటింగ్ మొత్తం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను" అని చెప్పింది.

కాగా, 2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్​లో అతిథి పాత్రలో మెరిసిన చాందిని చౌదరి ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్​లో ఓ క్యారెక్టర్‌లో నటించింది. 2015లో కేటుగాడులో హీరోయిన్​గా చేసింది. అనంతరం మహేశ్​ బాబు బ్రహ్మోత్సవంలో చిన్న కెమియో రోల్​, కుందనపు బొమ్మ, శమంతకమణి, లై, హౌరా బ్రిడ్జ్ సినిమాల్లో నటించింది. దీని తర్వాత కలర్ ఫోటోతో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ చిత్రంతో చాందినీ చౌదరి పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత బొంబాట్, సూపర్ ఓవర్, సమ్మతమే చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ సభా నాయగన్ చిత్రంలోనూ నటించింది. ఇప్పుడు త్వరలోనే విశ్వక్ సేన్​ గామీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

జక్కన్న సినిమాలో 8 లుక్స్​ - ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన మహేశ్​!

మహేశ్ నటించిన ఆ రెండు చిత్రాలు నమ్రతకు అస్సలు నచ్చవట!

ABOUT THE AUTHOR

...view details