తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సినిమా మొత్తం అలానే మేనేజ్​ చేశాను - నాకు చాలా గిల్టీగా ఉంది' - Nawazuddin Siddiqui interviews

Nawazuddin Siddiqui Petta Movie : 'శైంధవ్' సినిమాతో టాలీవుడ్​ ప్రేక్షకులను పలకరించారు స్టార్ హీరో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో 'పేట' సినిమా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Nawazuddin Siddiqui Petta Movie
Nawazuddin Siddiqui Petta Movie

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 8:00 PM IST

Nawazuddin Siddiqui Petta Movie :సూపర్​స్టార్రజనీకాంత్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కి బాక్సాఫీస్​ వద్ద మాసివ్ సక్సెస్ అందుకున్న చిత్రాల్లో 'పెట' ఒకటి. మాస్​ ఎలిమెంట్స్​తో ఫ్యాన్స్ ఆకట్టుకున్న ఈ సిినిమాలో రజనీ సరసన సిమ్రన్ నటించగా, బాలీవుడ్ స్టార్​ నజీరుద్దీన్ సిద్ధిఖ్​ కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా నజీరుద్దీన్ ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆయన తాను బాగా నటించలేకపోయాననే అపరాధభావం ఇప్పటికీ ఉందంటూ చెప్పుకొచ్చారు.

"పేట సినిమాలో నేనెలా నటించానో నాకే అర్థంకాలేదు. భాష (తమిళం) తెలియకపోవడం వల్ల నేను చాలా విషయాలు గ్రహించలేకపోయాను. లిప్‌ సింక్‌తోనే సినిమా మొత్తాన్ని మేనేజ్‌ చేశాను. పెర్ఫామెన్స్‌ బాగా లేకపోయినప్పటికీ ఆ సినిమాకు పారితోషికం తీసుకున్నందుకు నాకు గిల్టీగా ఉంది. ఇలా సైంధవ్‌ విషయంలో జరగకూడదనుకునే నేను అన్నీ నేర్చుకున్నాను. నా పాత్రకు సంబంధించిన డైలాగ్ అర్థాలు తెలుసుకుని మరీ నేనే డబ్బింగ్‌ చెప్పాను" అని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు.

Petta Movie Cast : ఇక 'పేట' సినిమా విషయానికి వస్తే - కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీ తన స్టైల్​తో అందరినీ ఆకట్టుకున్నారు. 2019లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ డబ్బింగ్‌ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నవాజుద్దీన్​. ఆ తర్వాత ఆయన విక్టరీ వెంకటేశ్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'సైంధవ్‌' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మరోసారి పలకరించారు. డైరెక్టర్ శైలేష్‌ కొలను ఈ చిత్రాన్ని రూపొందించారు. 2024 సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్​లో ఈ సినిమా రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇటీవలే 'హడ్డీ' సినిమాతో ఆకట్టుకున్న నవాజుద్దీన్‌ తాజాగా హిందీలో మరో మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'హడ్డీ'లో ఆయన ట్రాన్స్​జెండర్​ రోల్​లో కనిపించారు. అయితే ఈ సినిమా కూడా మిశ్రమ ఫలితాలు అందుకుంది.

'సెట్స్​లోకి రాకముందు వెంకీ ఆ పని చేస్తారు - అలా చెప్పడం నాకసలు ఇష్టం ఉండదు'

నవాజుద్దీన్​ సినిమా కోసం మూవీ టీమ్​ సాహసం.. ఆ 300 మంది..

ABOUT THE AUTHOR

...view details