Naveen Polishetty Hand Fracture :టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి తాజాగా అమెరికాలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో చేతి ఫ్రాక్చర్ అవ్వగా, ఆయన ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయితే తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ను డిఫరెంట్గా ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు. అందులో ఆయన చేతికి పట్టీ ధరించి ఉండగా, సింగిల్ హ్యాండ్ వల్ల ఆయన ఎదుర్కొంటున్న కష్టాలను ఫన్నీగా చూపించారు. తనను తాను సెల్ఫ్ ట్రోల్ చేస్తూనే అభిమానులను నవ్వించేందుకు ప్రయత్నించారు.