తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హిట్ 3'లో సర్​ప్రైజింగ్​ స్టార్స్! ఆ ముగ్గురు కలిస్తే ఇక ఫుల్​ క్రేజీ! - NANI HIT 3 MOVIE

'హిట్ 3'లో అతిథి పాత్రల సందడి - ఆ ఇద్దరు ఓకే చెప్తే ఇక సందడే సందడి

HIT 3 Nani
HIT 3 Nani (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2025, 7:46 PM IST

HIT 3 Cameos : నేచురల్‌ స్టారీ నాని రీసెంట్​గా 'సరిపోదా శనివారం'తో సూపర్‌ హిట్‌ అందుకున్నారు. అదే ఊపుతో ఇప్పుడు ఆయన 'హిట్‌ 3' సెట్స్​లోకి అడుగుపెట్టారు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2025 మే 1న సినిమా రిలీజ్‌ కానున్న నేపథ్యంలో పలు కీలక షెడ్యూలను త్వరగా ముగించే పనుల్లో ఉన్నారు మేకర్స్​. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ బిగ్‌ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

హిట్‌ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. మొదటి చిత్రంలో విశ్వక్​ సేన్​ నటించగా, రెండో పార్ట్​లో అడివి శేష్​ మెరిశారు. ఇప్పుడు ఈ మూడో మూవీ నాని చేస్తుండటం వల్ల దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల 'హిట్‌: ద థర్డ్‌ కేస్' పేరిట రిలీజ్‌ ఓ చిన్న గ్లింప్స్ సూపర్ హిట్‌ అయింది. అందులో నాని పవర్​ఫుల్‌ కాప్ పాత్రలో కనిపించారు. అలా సినిమాపై అంచనాలను నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లారు.

అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రెండు కీలక గెస్ట్‌ రోల్స్‌ ఉన్నాయట. మునుపటి హిట్‌ సిరీస్‌లలో హీరోలుగా చేసిన విశ్వక్ సేన్, అడివి శేష్ 'హిట్‌ 3'లో కనిపిస్తారట. ఒకవేళ ఇది నిజమైతే ముగ్గురు స్టార్‌ హీరోలు అభిమానులకు సూపర్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఈ అంశంపై అటు నటీనటులు, ఇటు నిర్మాతలు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

నానీ తదుపరి సినిమాలు ఏంటి?
'హిట్​ 3' కాకుండా, నానీ నుంచి మరో భారీ సినిమా 'ది ప్యారడైజ్‌' రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి గతంలో నానీతో 'దసరా' తీసిన శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ స్టోరీలైన్‌ చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, నానీ పాత్రకు తగినట్లు తన శరీరాన్ని మార్చుకోవడానికి తీవ్ర కసరత్తులు చేయనున్నారని సమాచారం.

వీటి తర్వాత నాని, డైరెక్టర్ సుజీత్‌తో కలిసి పని చేయనున్నారు. ఈ సినిమా గురించి కొంతకాలం క్రితం ప్రకటించినప్పటికీ, నిర్మాణంపై ఎటువంటి అప్‌డేట్‌లు లేవు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ABOUT THE AUTHOR

...view details