Nani Sujeeth Movie:నేచురల్ స్టార్ నాని బర్త్‌డే సందర్భంగా సరిపోదా శనివారం మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. శనివారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. పూర్తిగా ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా నాని ఇంకో సినిమా గురించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. నాని 32వ సినిమా అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
నాని 32వ సినిమా కోసం స్టార్ డైరెక్టర్ సుజిత్‌తో జతకట్టనున్నారు. ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. 'టర్న్ డౌన్ ది వైలెన్స్, టర్న్ అప్ ది మ్యూజిక్' అనే ట్యాగ్‌తో వీడియో ప్రారంభమైంది. 48 సెకన్ల నిడివితో ఉన్న వీడియోను పలు క్యాప్షన్లతో ఇంట్రెస్టింగా మార్చారు. పూర్తిగా కార్టూన్స్‌తో ఉన్న వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక సినిమా 2025లో రానున్నట్లు వీడియో లాస్ట్‌లో ఓ క్లూ ఇచ్చారు. మరి ఈ వీడియోను మీరు చూసేయండి.
ఇక ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్జే సూర్య మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో సూర్య పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించారు. ఈ సినిమా కూడా డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ 2024 ఆగస్టు 29న సినిమా విడుదల కానుంది. నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో ఇదివరకు 'అంటే సుందరానికి' సినిమా తెరకెక్కింది.