తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవర్​ఫుల్​గా 'NBK 109' గ్లింప్స్- వీర లెవల్లో బాలయ్య ఎంట్రీ​ - NBK 109 Glimps - NBK 109 GLIMPS

NBK 109 Glimps: స్టార్ హీరో బాలకృష్ణ- బాబి కాంబోలో 'NBK109' తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి మేకర్స్ సోమవారం సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

NBK 109 Glimps
NBK 109 Glimps (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 11:42 AM IST

Updated : Jun 10, 2024, 12:02 PM IST

NBK 109 Glimps:నందమూరి బాలకృష్ణ- బాబి కాంబోలో తెరకెక్కుతున్న 'NBK109' నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. సోమవారం (జూన్ 10) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. జాలి, దయ పదాలకు అర్థం తెలియని ఓ అసురుడిగా బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. మరి మీరు ఆ గ్లింప్స్ చూశారా?

'దేవుడు చాలా మంచోడు అయ్యా. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది జాలి, కరుణ, దయ ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు' అంటూ బ్యాక్​గ్రౌండ్​ వాయిత్​తో గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది. అంటే సినిమాలో బాలయ్య దుర్మార్గుల పట్ల ఎలాంటి జాలి, దయ లేకుండా వ్యవహరిస్తారని గ్లింప్స్​తో క్లారిటీ ఇచ్చారు. దీంతో సినిమాలో భారీ యాక్షన్ సీన్స్​ అంచనా వేసుకోవచ్చు. ఇక రైల్వే స్టేషన్​లో పొగమంచులోంచి రెండు బ్యాగులు పట్టుకొని బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. గ్లింప్స్​లో ఈ ఎంట్రీ అదిరిపోయింది. ఇక వీడియో ఆఖర్లో బాలయ్య శత్రువు తల నరకి, గుర్రంపై స్వారీ చేయడం గ్లింప్స్​కు హైలైట్​గా నిలిచింది. చివరగా తమన్ మళ్లీ బ్యాక్​గ్రౌండ్ స్కోర్ అదరగొట్టారు.

అయితే సినిమా టైటిల్, రిలీజ్ డేట్​ కూడా రివీల్ చేస్తారని ఫ్యాన్స్ భావించినా మేకర్స్ వీటిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఇక పలు కారణాల వల్ల బ్రేక్ పడ్డ షూటింగ్ తిరిగి ప్రారంభమైందని ఇన్​సైట్ టాక్. ఇప్పటికే సినిమా 40 శాతం పూర్తి అయ్యిందట. ఇక వరుస షెడ్యూల్స్​లో చిత్రీకరణ పూర్తి చేసి ఇదే ఏడాది సినిమా విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

కాగా, సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేవోల్, ఊర్వశీ రౌతెలా, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా, మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు.

బాలయ్య ఆల్​టైమ్ టాప్ మూవీస్- ఈ సినిమాలకు ఉన్న క్రేజే వేరబ్బా - Balakrishna Records

ఏకైక హీరోగా బాలయ్య రికార్డ్- ఆ రోల్​లో నటించాలనేదే నటసింహం కోరిక - Balakrishna Birthday

Last Updated : Jun 10, 2024, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details