Daaku Maharaj Hindi :నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా 'డాకు మహారాజ్'. డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా తెలుగులో భారీ విజయం దక్కించుకుంది. తెలుగులో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న డాకు మహారాజ్ సినిమాను జనవరి 24(శుక్రవారం)న మేకర్స్ హిందీ వెర్షన్లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గుడ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
నార్త్ నటులు ఊర్వశీ రౌతేలా, బాబీ దేఓల్ కీలక పాత్రల్లో నటించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది. హిందీ రిలీజ్‌కు ముందే 'డాకు మహారాజ్' నార్త్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. బాలయ్యతో యంగ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయడం ప్రేక్షకుల్లో జోష్ నింపింది. ఈ పాట లిరికల్ వీడియో హిందీలోనూ తెగ వైరల్ అయ్యింది.
అలాగే డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య యాక్షన్ సన్నివేశాలు, తమన్ సంగీతానికి హిందీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఇప్పటివరకు తెలుగుకే పరిమితమైన బాలయ్య, తొలి సినిమాతోనే హిందీలో ఫుల్ రెస్పాన్స్ అందుకుంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫ్యూచర్లో బాలయ్య కూడా పాన్ఇండియా లెవెల్లో సినిమాలు తీయాలంటూ కామెంట్లు పెడుతున్నారు.