Thandel Songs :అక్కినేని నాగచైతన్య లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా 'తండేల్'. ఈసినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుసగా పాటలు విడుదల చేస్తున్నారు. రీసెంట్గా 'బుజ్జి తల్లి' పాట విడుదల చేయగా, తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు.
శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే పాటగా దీనిని తీర్చిదిద్దారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నమో నమః శివాయ అంటూ సాగే ఈపాటను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ దీనిని ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
బ్లాక్‌బస్టర్ బుజ్జి తల్లి
గతనెల మేకర్స్ సినిమా నుంచి బుజ్జి తల్లి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. సోషల్ మీడియాలో ఈ పాట ఫుల్ ట్రెండ్ అయ్యింది. ఈ 'బుజ్జి తల్లి' పాట విడుదలై నెల రోజులు దాటినా కూడా ఇంకా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లోనే ఉంటూ హవా కొనసాగిస్తోంది. 44 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఎక్కడ చూసినా రీల్స్ రూపంలో ఇదే కనపడుతోంది.