Prabhas Kalki 2898 AD trailer Kamal Haasan Look :ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే రేంజ్లో హాలీవుడ్‌ను తలదన్నేలా రిచ్ విజువల్స్, భారీ యాక్షన్ సీన్స్, అదిరిపోయే డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఇండియన్ సినిమా సగర్వంగా తలెత్తుకుని ధీటుగా నిలబడే రేంజ్లో మూడు నిమిషాల పది సెకన్ల పాటు ట్రైలర్‌ను కట్ చేశారు మేకర్స్. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల చూపు మరోవైపు తిప్పుకోనివ్వకుండా ఒక్కో సన్నివేశాన్ని చూపించారు.
హైలైట్‌గా కమల్ లుక్ - అయితే ఈ ప్రచార చిత్రంలో ప్రభాస్‌తో పాటు హైలైట్‌గా నిలిచింది అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్, అమితాబ్ లుక్స్, యాక్షన్‌ను మాత్రమే చూపించిన మేకర్స్ మొదటి సారి ఈ ట్రైలర్‌తో యూనివర్సల్ స్టార్, లోకనాయకుడు కమల్‌హాసన్ లుక్‌ను రివీల్ చేశారు. మొదటి నుంచి ఆయన ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగుతూ వస్తోంది. కానీ ఆ మధ్యలో తనది గెస్ట్ రోల్ అని చెప్పారు కమల్ హాసన్. అయితే ఎట్టకేలకు తాజాగా ఆయన లుక్‌ను కాస్త రివీల్ చేయడంతో కమల్ ఫ్యాన్స్‌లో భారీగా జోష్ పెరిగిపోయింది. అలాగే ఆడియెన్స్‌లో ఆయన పాత్రపై మరింత ఉత్సుకత పెరిగింది.
కమల్‌లా మరొకరు చేయగలరా? -సాధారణంగా కమల్ హాసన్ అంటే ప్రయోగాత్మలకు మారు పేరు. తెరపై కొత్తగా కనిపించడానికి, ప్రయోగాలు చేయడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడరు. తాజాగా ఈ చిత్రంతో మరోసారి ఆయనేంటో నిరూపించారు. వాస్తవానికి ప్రోస్థటిక్ మేకప్ కమల్‌కు కొత్తేమి కాదు. 28 ఏళ్ల క్రితమే భారతీయుడు సినిమాలో వయసు మీరిన వ్యక్తిగా ఓల్డ్ లుక్ కోసం ప్రోస్థటిక్ మేకప్ వేసుకున్నారాయన. ఆ తర్వాత దశావతారంతో పాటు చాలా సినిమాల్లోనూ ఈ మేకప్‌తో కనిపించారాయన. మళ్లీ ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ'తో పాటు 'ఇండియన్ 2' కోసం అలా కనిపించారు.