Nagarjuna Naa Saami Ranga World Wide Collections : టాలీవుడ్ మన్మథుడు, సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ' ఈ సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లను అందుకుంటోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ బాగా ఆడుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రానికి 6 రోజుల్లో రూ.19.43 కోట్ల షేర్ వచ్చింది. అలానే వరల్డ్ వైడ్‌గా రూ. 38.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో 'నా సామిరంగ' 6వ రోజు కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నైజాంలో – 22 లక్షలు, సీడెడ్ – 24 లక్షలు, వైజాగ్ – 26 లక్షలు, ఈస్ట్ – 18 లక్షలు, వెస్ట్ – 11లక్షలు, కృష్ణ – 9 లక్షలు, గుంటూరు – 11 లక్షలు, నెల్లూరు – 6లక్షలు వచ్చాయని తెలిసింది. మొత్తంగా 6వ రోజు రూ. 1.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందట. 6 రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 19. 43 కోట్ల షేర్ వచ్చిందట. వరల్డ్ వైడ్ రూ. 38.5 కోట్ల గ్రాస్ వచ్చింది.
ఈ సినిమాను విజయ్ తెరకెక్కించారు. మాస్ అండ్ ఫ్యామిలీ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించారు.