Naga chaitanya Sobhita dhulipala Wedding : అక్కినేని ఇంట పెళ్లి బాజా మోగింది. అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి వివాహం బుధవారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ జంట పెళ్లి వేడుక జరిగింది. ఈ ముచ్చటైన వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సినీ పెద్దలు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశ్వీరద్వించారు.
ఇంకా ఈ వేడుకలో టి. సుబ్బిరామిరెడ్డితో సహా పలువురు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నూతన దంపతులకు అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, చై - శోభిత నిశ్చితార్థం ఆగస్టులో జరిగిన విషయం తెలిసిందే. ఇకపోతే మరోవైపు, నాగచైతన్య సోదరుడు, హీరో అఖిల్‌కు కూడా ఇటీవల నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనునున్నాడు.
సినిమాల విషయానికొస్తే, నాగ చైతన్య తండేల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో సాయి పల్లవి నటించింది. గత కొద్ది కాలంగా బడా సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న చైతూ ఈ సారి 'తండేల్'తో దాన్ని అందుకునేలా ఉన్నారని ఫ్యాన్స్ అంటున్నారు.