Naga Chaitanya Sobhita Dhulipala Wedding :టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లి వేదిక గురించి నెట్టింట ఓ వార్త ట్రెండ్ అవుతోంది. తొలుత, వీరి వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్గానే ప్లాన్ చేయగా, ఇప్పుడు ఆ వేదికను హైదరాబాద్‌కు షిప్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట వివాహం జరగనుందట. ఈ వేడుక కోసం ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అక్కడ ప్రత్యేకమైన సెట్ వేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వేదికను ప్రత్యేకంగా అలంకరించే పనులు కూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయట. ఇక అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుందని సమాచారం.
అప్పుడే హింట్
నటి శోభిత ఇంట్లో వారం కిందటే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా శోభిత షేర్ చేసుకున్నారు. 'గోధుమ రాయి పసుపు దంచడం, మొదలైపోయింది' అంటూ అందుకు సంబంధించిన ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆమె స్వయంగా పసుపు దంచుతున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీంతో త్వరలోనే వీరి పెళ్లి ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. అనుకున్నట్లు గానే పెళ్లి తేదీ చెప్పేశారు. అటు అక్కినేని వారి ఇంట్లో కూడా త్వరలోనే పెళ్లి పనులు ప్రారంభం కానున్నాయి.