ETV Bharat / international

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి మృతి

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు జాన్ మృతి

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2024, 6:42 AM IST

World Oldest Man Died : ప్రపంచంలో అత్యంత వృద్ధుడైన జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌ ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌ నగర సమీపంలో గల శరణాలయంలో మృతిచెందారు. ఆగస్టు 26న తన 112వ పుట్టినరోజు జరుపుకున్న జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ గిన్నిస్‌ రికార్డుల ప్రకారం దాదాపు తొమ్మిది నెలలపాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదాలో ఉన్నారు. సౌత్‌పోర్టులోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆయనకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ బృందం ఈ ఏడాది ఏప్రిల్​లో సర్టిఫికెట్‌ అందజేసింది. అయితే, సాధారణ జీవన విధానం, అదృష్టమే తన దీర్ఘాయుష్షు రహస్యమని ఆయన అప్పుడు చెప్పడం గమనార్హం.

చారిత్రక విషాదమైన టైటానిక్‌ ఓడ మునిగిన 1912లో జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌ జన్మించారు. టైటానిక్‌ నౌక మునిగిన కొన్ని రోజులకే పుట్టిన ఆయన తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ఆర్మీలో సేవలందించారు. అకౌంటెంట్‌గా పదవీ విరమణ చేసిన ఆయన, ఇంతకాలం పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి సాధారణ జీవన విధానమే కారణమని చెప్పేవారు.

"ఎప్పుడూ ధూమపానం చేయలేదు. మద్యం మాత్రం అరుదుగా తీసుకునేవాడిని. ప్రతి శుక్రవారం చేపలు, చిప్స్‌ తీసుకోవడం తప్పితే ప్రత్యేకంగా ఎటువంటి డైట్‌ పాటించలేదు. పూర్తిగా ఇది జీవనశైలితోపాటు నా అదృష్టమే" అని జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వూడ్‌ కొంతకాలం క్రితం పేర్కొన్నారు. ఆయనకు కుమార్తె సుసాన్, నలుగురు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. భార్య బ్లాడ్వెన్ 1986లోనే మరణించారు.

అయితే వెనెజులాకు చెందిన 114 ఏళ్ల వృద్ధుడు జువాన్‌ విసెంటే పెరెజ్‌ కొన్ని నెలల క్రితం ప్రాణాలు కోల్పోయారు. జపాన్‌కు చెందిన మరో వృద్ధుడు గిసాబురో సోనోబే (113) మార్చి 31న చనిపోయారు. దీంతో ఆ రికార్డు జాన్‌ ఆల్ర్ఫెడ్‌ పేరు మీద నమోదయ్యింది. ఇప్పుడు ఆయన సోమవారం మరణించారు. దీంతో టిన్నిస్‌వుడ్ స్థానంలో కొత్త రికార్డ్ హోల్డర్‌గా ఎవరు వస్తారోనని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా పేర్కొనలేదు. స్పెయిన్‌కు చెందిన మరియా బ్రన్యాస్‌ మోరేరా (117) ప్రపంచంలోనే వృద్ధ మహిళగా కొనసాగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.