ETV Bharat / state

'కేసులకు నేనేం భయపడటం లేదు' - మళ్లీ ఆర్జీవీ వివాదాస్పద వీడియో రిలీజ్ - RGV RELEASE VIDEO ON AP POLICE

ఈ కేసులో విచారణకు అంత అత్యవసరం ఏంటని ప్రశ్నించిన ఆర్జీవీ - వీడియో రిలీజ్​ చేసిన వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ - నేనేం కేసులకు భయపడటం లేదంటూ వ్యాఖ్య

Ram Gopal Varma
Ram Gopal Varma (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 7:02 AM IST

Updated : Nov 27, 2024, 10:00 AM IST

Ram Gopal Varma : సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని వివాదాస్పద దర్శకుడు రాం​ గోపాల్​ వర్మపై ఆంధ్రప్రదేశ్​లో కేసు నమోదైంది. ఈ కేసులో తప్పించుకొని తిరుగుతున్న ఆర్జీవీని ఏపీ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆర్జీవీ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ కేసులకు తానేం భయపడటం లేదని వీడియోలో తెలిపారు. ఏడాది క్రితం పెట్టిన ఏవో ట్వీట్స్​ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని అని అన్నారు. తాను ట్వీట్స్​ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు.

ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకొని పాలన చేస్తున్నారని వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ మండిపడ్డారు. అమెరికా, యూరప్​లో లాగే ఇక్కడ అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్​లో ఉన్నానని.. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు. అయినా హత్యలు, ఇతర కేసులకు సంవత్సరాలు సమయం తీసుకుని.. ఈ కేసు విచారణకు ఇంత అత్యవసరం ఏంటని ఆర్జీవీ వీడియోలో ప్రశ్నించారు.

అసలేం జరిగింది : సోషల్​ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్​ మీద అసభ్యకరమైన పోస్టులు చేశారంటూ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీపై ఏపీలోని ఒంగోలు రూరల్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు హాజరుకావాలని ఈనెల 19న ఆర్జీవీకి హైదరాబాద్​లోని తన ఆఫీసుకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు రాకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్​ వేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్​ను కొట్టేసింది. దీంతో వారం రోజుల్లో విచారణకు వస్తానని.. వాట్సాప్​లో దర్యాప్తు అధికారికి సందేశం పంపించారు.

తాను ఓ సినిమా షూటింగ్​లో ఉన్నానని.. నేను వస్తే నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని అందులో తెలిపారు. పోలీసులు స్పందించకపోవడంతో.. న్యాయవాది ద్వారా లేఖను పోలీసులకు అందించారు. ఈనెల 25న విచారణకు హాజరు కావాలని పోలీసులు మళ్లీ నోటీసులు ఇవ్వగా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులు డైరెక్టుగా హైదరాబాద్​లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లారు. అక్కడి వారిని ప్రశ్నించగా ఫలితం లేకుండా పోయింది. ఆర్జీవీకి ఫోన్​ చేస్తే స్విఛాప్​ వస్తుందడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్​, తమిళనాడులలో ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

ఆర్జీవీ ఎక్కడ ? - ఆంధ్రప్రదేశ్ పోలీసుల 'వ్యూహం' బెడిసికొట్టాందా?

రామ్​గోపాల్​ వర్మపై వరుసగా కేసులు నమోదు - కొంపముంచిన సోషల్ మీడియాలో పోస్టులు

Last Updated : Nov 27, 2024, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.