Allu Arjun Pushpa Remuneration : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. 'పుష్ప' సినిమా ద్వారా దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా రికార్డుకెక్కారు. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన 2024లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న టాప్-10 స్టార్స్ జాబితాలో అల్లు అర్జున్ పేరు టాప్‌లో ఉంది. రూ.300కోట్లతో ఆయన ఈ లిస్ట్‌లో మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 'పుష్ప2' కోసం ఆయన ఇంతటి భారీ పారితోషికం అందుకున్నట్లు ఆ కథనంలో పేర్కొంది.
ఇక ఆ తర్వాతి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఉన్నారు. రీసెంట్గా వచ్చిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్', అలాగే 'లియో' సినిమాలతో పాటు అప్‌కమింగ్ మూవీ #విజయ్ 69 మూవీ కోసం ఆయన రూ.275 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట.
ఇదిలా ఉండగా, వీరిద్దరి తర్వాత మూడో స్థానాన్ని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సొంతం చేసుకున్నారు. 'డంకీ' సినిమా కోసం ఆయన కోసం సుమారు రూ.150-250 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఇక రజనీకాంత్ (₹.150- ₹.270 కోట్లు), ఆమిర్ ఖాన్ (₹.100-₹275 కోట్లు), అలాగే ప్రభాస్ (₹.100-₹200 కోట్లు), తల అజిత్ (₹.105-₹165 కోట్లు), సల్మాన్ ఖాన్ (₹.100-₹150 కోట్లు), కమల్ హాసన్ (₹.100- ₹150 కోట్లు) అక్షయ్‌కుమార్ (₹.60-₹145 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు ఫోర్బ్స్ సంస్థ తాజాగా పేర్కొంది.
బన్నీతో పాటు వారు కూడా :
అయితే బన్నీనే కాదు 'పుష్ప2'లో పని చేసిన పలువురు నటీనటులు కూడా భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నారట. హీరోయిన్ రష్మిక రూ.10 కోట్లు, విలన్ రోల్లో మెరిసిన ఫహద్ ఫాజిల్ రూ.8 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలోని 'కిస్సిక్' కోసం వర్క్ చేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల కేవలం ఆ ఒక్క పాట కోసమే రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ పుచ్చుకున్నారట. చూస్తుంటే ఈ భారీ బడ్జెట్ సినిమాలో పారితోషకం కూడా భారీగానే ఉందంటూ సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.
'శ్రీలీల వల్ల జీవితంలో తొలిసారి అలా చేయాల్సి వచ్చింది!' : అల్లు అర్జున్
'తొలి సారి వచ్చా ఇక్కడికి - అలా జరిగినందుకు కారణం మీరే' : అల్లు అర్జున్