ETV Bharat / entertainment

సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్​ను పెళ్లాడనున్న అఖిల్​ - ఎంగేజ్మెంట్ ఫొటోలు చూశారా? - AKKINENI AKHIL ENGAGEMENT

ఓ ఇంటివాడు కానున్న అక్కినేని అఖిల్ - ఎంగేజ్మెంట్ ఫొటోలు చూశారా?

Akkineni Akhil Engagement
Akkineni Akhil (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 6:38 PM IST

Akkineni Akhil Engagement : టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్‌ అక్కినేని త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నారు. తాజాగా ఆయన నిశ్చితార్థం జైనబ్‌ రవ్జీతో జరిగినట్టు అఖిల్‌ తండ్రి, నటుడు నాగార్జున తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా ఎంగేజ్మెంట్ ఫొటోలను విడుదల చేసి జైనబ్‌ తమ కోడలు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

"జైనబ్‌తో మా కుమారుడి ఎంగేజ్మెంట్ జరిగిందని తెలియజేస్తున్నందుకు మేము ఎంతో ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు కావాలి" అంటూ నాగ్​ పోస్ట్‌ పెట్టారు.

ఇదిలా ఉండగా, అఖిల్‌ కూడా ఈ గుడ్ న్యూన్​ను తన అభిమానులతో పంచుకున్నారు. అక్కినేని ఇంట ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వేడుక జరిగనట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్​ కాలేదని సమాచారం.

ఎవరీ జైనబ్‌ రవ్జీ ?
జైనబ్‌ దిల్లీకి చెందిన అమ్మాయి. ఈమె థియేటర్‌ ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు, ఓ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా. ఇండియాలోనే కాకుండా లండన్‌, దుబాయ్‌లోనూ ఆర్టిస్ట్‌గా ఆమె బాగా పాపులరే. ఇక రెండేళ్ల క్రితం వీరిద్దరు పరిచయమవ్వగా, అది కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జైనబ్‌ తండ్రి జుల్ఫీ రవ్జీ, నాగార్జున కొన్నేళ్లుగా ఫ్రెండ్స్​ అని సమాచారం. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారు.

అయితే ఫ్యాన్స్ అంతా అఖిల్‌ అప్​కమింగ్ మూవీ గురించి అప్​డేట్ ఇస్తారనుకుంటే ఇప్పుడిలా ఎంగేజ్మెంట్ విషయం తెలియడం వల్ల సర్‌ప్రైజ్‌ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త జంటకు కంగ్రాజ్యూలేషన్స్​ తెలుపుతున్నారు. ఇక అఖిల్ గతేడాది 'ఏజెంట్‌'తో ప్రేక్షకులను పలకరించగా, అది కాస్త నిరాశగానే మిగిలింది. దీంతో ఇప్పుడు ఆయన తన కొత్త సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన లుక్​ను కూడా మార్చారు. రీసెంట్​గా పలు ఈవెంట్స్​లోనూ ఆ లుక్​తోనే కనిపించారు. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

పీరియాడికల్ డ్రామాలో అఖిల్- డైరెక్టర్ ఎవరంటే?

అందుకే ఈ గ్యాప్​ - అఖిల్ లిస్ట్​లో మూడు భారీ ప్రాజెక్టులు! - Akkineni Akhil Upcoming Movies

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.