ETV Bharat / state

ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లోని అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందే : హైకోర్టు - HIGH COURT ON MUSI RIVER

మూసీనది ప్రక్షాళనపై హైకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ - అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగించాల్సిందేనన్న హైకోర్టు - నదిలో మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం

Musi River Rejuvenation Project
High Court On Musi River (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 7:50 AM IST

Telangana High Court On Musi River : మూసీ సుందరీకరణకు మార్గం సుగమమైంది. మూసీ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలు తొలగించేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను తొలగించడం సహా కలుషిత నీరు నదిలో కలవకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని హైకోర్టు సూచించింది.

మూసీనది ప్రక్షాళనపై కీలక మార్గదర్శకాలు : మూసీనదీగర్భం, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్​లో చట్టవిరుద్దంగా, అనధికారికంగా ఉన్న నివాసాలను ఖాళీ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగునీరు, కలుషిత నీరు రాకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే ప్రభావితమవుతాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని పేర్కొంది.

ఆక్రమణలో ఉన్న పట్టాభూములు, శిఖం భూములైతే వారికి సమాచారం ఇవ్వడం లేదా ఆ భూయజమానులకి నోటీసులు జారీచేసి చట్టం ప్రకారం తగిన పరిహారం చెల్లించడం ద్వారా సేకరించాలని అధికారులను ఆదేశించింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నివాసాలు ఖాళీ చేయించడం, కూల్చివేతలను సవాల్‌చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. ఒకే అంశానికి సంబంధించిన పిటిషన్లు కావడంతో అన్నింటినీ పరిష్కరిస్తూ నివాసాలను ఖాళీ చేయించేందుకు, ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు అనుసరించాల్సిన చర్యలపై కీలక మార్గదర్శకాలు జారీచేశారు.

హైకోర్టు ఆదేశాలు :

  • మూసీ బఫర్‌జోన్, ఎఫ్టీఎస్, రివర్‌బెడ్ జోన్లలోని ఆక్రమణదారుల నిర్మాణాలను తొలగించే సమయంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలి.
  • మూసీ రివర్‌బెడ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లోని తాత్కాలిక, అనధికారిక నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలి.
  • 2012 బిల్డింగ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
  • నిబంధనలకు విరుద్ధంగా మూసీ నదిలో నిర్మాణాలుంటే చట్టప్రకారం తొలగించాలి.
  • మూసీలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కింది కోర్టులు ఇంజక్షన్​ ఉత్తర్వులు జారీ చేసే ముందు 2023లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • అక్రమణ నిర్మాణాల తొలగింపుపై స్టే తాత్కాలిక ఇంజిక్షన్ ఉత్తర్వులిచ్చే చేసే ముందు హైకోర్టు పంపిన సర్క్యులర్‌ను కింది కోర్టులు అమలు చేయాలి.
  • ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను అధికారులు గుర్తించేందుకు నిర్వహించే సర్వేకి పిటిషనర్లు, ప్రజలు, ఆక్రమణదారులు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సంయమనం పాటించాలి.
  • కోర్టు ఉత్తర్వుల అమలుకి నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖలకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలి.
  • నదులు, నీటివనరులు, సరస్సులు, చెరువులను ఆక్రమించుకున్న అక్రమార్కులు, భూకబ్జాదారులపై ఇరిగేషన్ చట్టం 1357, వాల్టా చట్టం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలి.

1317లోనే నవాబు రెవెన్యూ చట్టం చేశారు : 1908లో నగరంపై మూసీ వరదలు రావడంతో అప్పటి నవాబ్​ జంట జలాశయాలు నిర్మించారని హైకోర్టు తెలిపింది. ఆ సమయంలో ల్యాండ్ రెవెన్యూ చట్టాన్ని1317లో తీసుకొచ్చారన్న కోర్టు.. అందులో సెక్షన్ 24 పబ్లిక్‌రోడ్లు, దారులు, బ్రిడ్జిలు, గుంతలు, నదులు, చెరువులు, ట్యాంకుల, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలు తదితర భూముల వివరాలున్నాయని వాటన్నింటిపై హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయన్నారు. ఆ చట్టం కింద వచ్చిన అధికారంతో సర్వే నిర్వహించి టిప్పన్, విలేజ్ నక్ష, ఒరిజినల్ సేత్వార్, వసూల్‌బాక్వి, టౌన్‌సర్వే ల్యాండ్‌రిజిస్టర్, రికార్డ్ ఆఫ్ మెజర్మెంట్ రికార్డులు తయారైట్లు తెలిపింది. ఆ రికార్డులు సర్వే నెంబర్లు, విస్తీర్ణం, బావులు, నదులు, ఇళ్లు, తదితర వివరాలన్నింటినీ నమోదు చేశారని వివరించింది.

కొందరు మోసగాళ్లు చెరువులు, ట్యాంకులు, రివర్ బెడ్లని ప్లాట్లుగా మార్చి ప్రైవేట్‌వ్యక్తులకు అప్పగించడంతో పాటు పలు ప్రార్ధనా మందిరాలు నిర్మించినట్లు పేర్కొంది. ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ సమ్మతితోనే నీటివనరులు, కాలువల నిర్వహణ ఉంటుందని చెప్పింది. అన్ని చర్యలు తీసుకున్నా ఫలితంలేక పోవడంతో ప్రభుత్వం 2002లో వాల్టాచట్టాన్ని తీసుకువచ్చిందని పేర్కొంది. ఆ చట్టం ప్రకారం టాస్క్‌ఫోర్స్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న హైకోర్టు 2007లో జిల్లా స్థాయిలో వాచ్ డాగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో 386 తీసుకువచ్చిందని గుర్తుచేసింది.

ఎఫ్టీఎల్, బఫర్ జోన్​లో ఏ నిర్మాణాలు చేపట్టరాదు : నీటి వనరుల పరిరక్షణలో భాగంగా పూడికతీత, కట్టలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకాన్ని చేపట్టిందన్న హైకోర్టు అందులో భాగంగా ప్రభుత్వం 2012లో బిల్డింగ్‌ నిబంధనలు రూపొందిస్తూ జీవో 168 జారీ చేసినట్లు వివరించింది. ఆ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఏ నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొంది. దేశంలోనే తొలిసారిగా 48 వేల మేజర్, మైనర్ చెరువుల్లో పూడికతీతని దశలవారీగా చేపట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని పేర్కొంది. ట్యాంకులు, చెరువుల భూములని నిషేధిత జాబితాలో చేరుస్తూ సీసీఎల్​ఏ సర్క్యులర్ జారీ చేశారని వివరించింది. ఇన్ని చేసినా చెరువులను అక్రమార్కుల బారినుంచి రక్షించలేకపోయారని తెలిపింది. చెరువుల పరిరక్షణ సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో భూకేటాయింపుల విధానం తీసుకొచ్చిందని వివరించింది.

ఆ విధానం ప్రకారం సహజ కొండ ప్రాంతాలు, నదులు, రివర్ బెడ్లను కేటాయింపులు జరపరాదని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేయడం ద్వారా చెరువుల రక్షణకి జీవో 99 ద్వారా ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. తెలంగాణ ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. చట్ట ప్రకారం ప్రత్యేక అధికారాలిచ్చినట్లు తెలుస్తోందని గుర్తు చేసింది. జీవో జారీచేయడం ద్వారా నీటిపారుదల శాఖ అధికారికి బాధ్యతలు, విధులు అప్పగించడం తప్పుకాదన్నారు. ఇరిగేషన్‌ చట్టంలోని సెక్షన్ 4 కింద విధులు నిర్వహించేందుకు ఏ అధికారినైనా నియమించవచ్చని కోర్టు చెప్పింది. చెరువులు, నదులు సమాజానికి చెందిన ఆస్తులని, వాటిని ట్రస్టీలుగా అధికారులు నిర్వహిస్తారని హైకోర్టు స్పష్టంచేసింది.

చెరువుల్లో ఇళ్ల పట్టాల కేటాయింపు జరిపినా వాటికి చట్టబద్ధతలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చట్టం రూపొందించిందని, న్యాయసమీక్షలో చట్టం తీసుకొచ్చిన ఉద్దేశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని వివరించింది. మూసీలో పర్యావరణ సమతౌల్యత పరిరక్షణ, భవిష్యత్తరాలకి ప్రభుత్వం విధివిధానాలు తీసుకొచ్చిందని తెలిపింది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో వివరించింది.

అందరినీ మురిపించేలా మూసీ! - మరి భారం పడకుండా ఎలా?

సీఎం రేవంత్‌రెడ్డి 'మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర' షెడ్యూల్​ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.