తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అంబానీ ప్రీ వెడ్డింగ్​లో 'నాటు నాటు' ఫీవర్​ - చెర్రీతో స్టెప్పులేసిన బాలీవుడ్ తారలు - అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక

Naatu Naatu song in Anant Ambani Pre Wedding : బాలీవుడ్ స్టార్​ హీరోలు ముగ్గురు ఖాన్​లు కలిసి అనంత్ అంబానీ- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో సందడి చేశారు. 'నాటు నాటు' సాంగ్​కు రామ్​ చరణ్​తో కలిసి స్టెప్పులేసి అదరగొట్టేశారు.

Naatu Naatu song in Anant Ambani Pre Wedding
Naatu Naatu song in Anant Ambani Pre Wedding

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 1:41 PM IST

Naatu Naatu Song in Anant Ambani Pre Wedding : దేశంలోనే అత్యంత సంపన్నులో ఒకరైన అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. నాలుగు నెలల ముందే ప్రారంభమైన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. గుజరాత్​లోని జామ్​నగర్​లో జరుగుతున్న ఈ వేడుకల్లో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు. ఇక ఈవెంట్​లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన 'నాటు నాటు' సాంగ్ ఓ ఊపు ఊపేసింది. ఈ పాటకు ముగ్గురు బాలీవుడ్ స్టార్​ హీరోలు స్టెప్పులేసి అభిమానులను హోరెత్తించారు. ఆ వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

చిందులేసిన బాలీవుడ్​ ఖాన్​లు
బాలీవుడ్​లోని ముగ్గురు ఖాన్​లు కలిసి ఆర్​ఆర్​ఆర్​లోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటుకు డ్యాన్స్ చేశారు. నాటు నాటు సాంగ్ హిందీ వెర్షన్ నాచో నాచోకు సల్మాన్, షారుక్ ఖాన్, అమిర్ ఖాన్ కలిసి చిందులేశారు. నిజానికి వీళ్లు ముగ్గురిని ఒకే వేదికపై చూడటం చాలా అరుదు. అలాంటిది ముగ్గురు కలిసి అంబానీ ఈ వెంట్​లో డ్యాన్స్ చేయటం ఆడియన్స్​ సంబరపడిపోతున్నారు. నాటు నాటు తర్వాత వారి హిట్ సాంగ్స్​లో చేసిన హుక్​ స్టెప్పులను ముగ్గురూ రీ క్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. 'ఖాన్స్‌ ముగ్గురితో ఒకే స్టేజ్‌ మీద డ్యాన్స్‌ వేయించడం అంబానీకే సాధ్యం' అంటూ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ పాటకు చిందేయటం తెలుగు ఆడియన్స్ కూడా 'వావ్' అంటున్నారు. ఈ ప్రీవెడ్డింగ్​ ఈవెంట్​లో రామ్​చరణ్​- ఉపాసన జంట కూడా సందడి చేసింది. ఆ ముగ్గురితో కలిసి రామ్ చరణ్ కూడా స్టేజీ మీద నాటు నాటు సాంగ్​కు స్టేప్పులేశారు. రామ్​చరణ్ జంట వీళ్లిద్దరూ ధోనీ దంపతులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వీళ్లందరూ కలిసి ఈవెంట్‌కు వెళ్తున్న వీడియోను సినీ, క్రీడాభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఇక దీపిక పదుకొనె ప్రెగ్నెంట్​గా ఉన్న కూడా రణ్​వీర్ సింగ్​తో కలిసి స్టేజీ మీద డ్యాన్స్ చేసింది.

మరోవైపు సినీ తారలు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, షారుక్‌ఖాన్‌ కుటుంబం, అర్జున్‌ కపూర్‌, ఆలియాభట్‌-రణబీర్‌ కపూర్‌ కుటుంబం, డైరెక్టర్ అట్లీ తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు.

ఓ ఊపు ఊపేసిన జాన్వీ - అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో డ్యాన్స్ హంగామా!

'చెర్రీ సో కేరింగ్​' - ఫ్లైట్​లో భార్య కాళ్లు నొక్కుతున్న రామ్​ చరణ్​

ABOUT THE AUTHOR

...view details