Naa Saami Ranga Success Meet:2024 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్‌లో సైలెంట్‌గా వచ్చి హిట్ అందుకున్నారు నాగార్జున అక్కినేని. ఆయన లీడ్ రోల్లో తెరకెక్కిన 'నా సామిరంగ' జనవరి 14న రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆదివారం (జనవరి 28) మూవీటీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న నాగార్జున సినిమా గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
నా సామిరంగ సినిమా ప్రారంభమైనప్పుడు సంక్రాంతికి విడుదల చేయాలని అన్నప్పుడు ఎవరు నమ్మలేదని నాగార్జున అన్నారు.' సెప్టెంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభించాం. సంక్రాంతికి రిలీజ్ చేయాలని అప్పుడే అనుకున్నా. కానీ, నా ఫ్యామిలీతో సహా అందరూ షాకయ్యారు. రిలీజ్ గురించి మాట్లాడితే బయట వాళ్ల మొహాల్లో నమ్మకం కూడా లేదు. కానీ, నా టీమ్ కాన్ఫిడెంట్‌గా ఉంది. అది చాలు అనుకున్నా. అంతే అద్భుతంగా ముగించాం. సినిమాను ఇంత సక్సెస్ చేసిన ఫ్యాన్స్‌కు, డిస్ట్రిబ్యూటర్లకు థాంక్స్. సీ యూ నెక్ట్స్ సంక్రాంతి' అని అన్నారు. దీంతో 2025 సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ బరిలో ఉండనున్నట్లు నాగార్జున హింట్ ఇచ్చారు.
సినిమా విషయానికొస్తే: నా సామి రంగ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటింగా అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.