తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సినిమాల్లోకి షారుక్‌ ఖాన్‌ చిన్న కొడుకు - ట్రైలర్ అదిరింది - Mufasa The lion king - MUFASA THE LION KING

Mufasa The lion king Sharukh Son Abram : బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్​ ఖాన్‌ చిన్న తనయుడు అబ్రం ఖాన్‌ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. తండ్రితో కలిసి అప్పుడప్పుడు ఫొటోలకు క్యూట్​గా పోజులిస్తుంటాడు. అయితే ఇప్పుడతడు సిల్వర్​ స్క్రీన్​పై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడని తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI
Mufasa The lion king Sharukh Son Abram (source ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 12, 2024, 4:25 PM IST

Mufasa The lion king Sharukh Son Abram : బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్​ ఖాన్‌ చిన్న తనయుడు అబ్రం ఖాన్‌ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. తండ్రితో కలిసి అప్పుడప్పుడు ఫొటోలకు క్యూట్​గా పోజులిస్తుంటాడు. అయితే ఇప్పుడతడు సిల్వర్​ స్క్రీన్​పై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడని తెలిసింది. కానీ నటుడిగా కాదు. ఓ ప్రముఖ ప్రాజెక్ట్‌ కోసం వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

అదేంటంటే? -హాలీవుడ్​లో ఐదేళ్ల కిందట వచ్చిన సూపర్ హిట్ మూవీ ది లయన్ కింగ్. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ముఫాసా : ది లయన్ కింగ్ పేరుతో ఇది తెరకెక్కింది. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌, ఆరోన్‌ స్టోన్‌ సహా పలువురు నటిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 20న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకే అబ్రం వాయిస్‌ అందించాడు. అలానే ఇదే సినిమాలో ముఫాసా పెద్దయ్యాక పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ వాయిస్‌ ఇచ్చారు. ఈ ప్రచార చిత్రం ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఒకేసారి షారుక్, ఆయన వారసుల వాయిస్‌ను వినడం ఎంతో ఆనందంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

షారుక్ రియాక్షన్ -తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమని చెప్పారు. "ముఫాసా అడవి రారాజు. అతడే ఓ అల్టిమేట్ కింగ్. తన తెలివిని, జ్ఞానాన్ని తన కొడుకు సింబాకు అందిస్తాడు. తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది. బాల్యం నుంచి కింగ్​గా ఎదగడం వరకూ ముఫాసా లైఫ్​ ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. నా పిల్లలతో కలిసి ఈ సినిమా కోసం పని చేయడం ఆనందంగా ఉంది" అని షారుక్‌ అన్నారు. కాగా, బేరీ జెంకిన్స్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇండిపెండెన్స్ డే వీక్- థియేటర్లలో హై వోల్టేజ్ మూవీస్- OTTలో క్రేజీ సిరీస్​లు - Independence Day Movie Releases

రాజమౌళి ఫాదర్​ ఫోన్​ కాల్​తో ఎమోషనల్ అయ్యా: పూరి జగన్నాథ్‌ - Double Ismart

ABOUT THE AUTHOR

...view details