Mr Bachchan Double Ismart Day 1 Collection:మాస్ మహారాజ రవితేజ, ఉస్తాద్ రామ్ పోతినేని గురువారం తమతమ లేటెస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హాలీడే రోజున ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ ఇద్దరు హీరోలు సక్సెస్ అయ్యారు. తొలి రోజు ఈ రెండు చిత్రాలు దాదాపు 70శాతం ఆక్యుపెన్సీతో రన్ అయ్యాయి. మరి ఇందులో ఎవరి సినిమా ఎంత వసూల్ చేసింది? తెలుసుకుందాం
Mr Bachchan Day 1 Collection: రవితేజ హీరోగా యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన 'మిస్టర్ బచ్చన్' బుధవారం సాయంత్రం నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో మూవీ డిసెంట్ కలెక్షన్లే వసూల్ చేసింది. తొలి రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా (ప్రీమియర్స్ కలిపి) రూ.5.3కోట్ల నెట్ కలెక్షన్ చెసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా ఇది. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. నటన పరంగా రవితేజ అదరగొట్టారు. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించారు.