Movies In Etv : కొత్త వారం మొదలైపోయింది(ఫిబ్రవరి 19). దీంతో జాబ్ హోల్డర్స్ అంతా ఉద్యోగాలకు వెళ్లిపోతారు. అయితే ఇంట్లో ఉండేవారు మాత్రం ఫోన్లతో పాటు టీవీలతోనే కాలక్షేపం చేస్తుంటారు. ముఖ్యంగా ఆడవారు సీరియళ్లతో పాటు బుల్లితెరపై వచ్చే చిత్రాలను చూస్తుంటారు. వారి కోసం నేడు(ఫిబ్రవరి 19) ఈటీవీ ఛానల్లో ఏఏ సమయానికి ఏఏ చిత్రాలు వస్తున్నాయో వంటి వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం.
వివరాల్లోకి వెళితే. ఈటీవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తూ ఇంటిల్లిపాదిని ఎంటైర్‌టైన్ చేస్తోంది. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవి విన్‌తో ఎన్నో సినిమా సిరీస్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతివారంలానే నేడు కూడా బోలేడు హిట్ సినిమాలను ప్రసారం చేస్తోంది. అయితే వీటిలో ఈరోజు ఎక్కువగా విక్టరీ వెంకటేశ్ నటించిన చాలా చిత్రాలు ప్రసారం కానుండటం విశేషం.
ఈటీవీ(ETV)లో ఉదయం 9 గంటలకు నందమూరి నటసింహం బాలకృష్ణ, అందాల తార రోజా నటించిన సోషియో ఫాంటసీ భైరవ ద్వీపం ప్రసారం కానుంది. ఈ చిత్రం అపట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ టీవీ ప్లస్‌లో (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు విక్టరీ వెంకటేశ్ నటించిన అగ్గిరాముడు, రాత్రి 10 గంటలకు కింగ్ నాగార్జున నటించిన చైతన్య చిత్రం ప్రసారం కానుంది. ఈ సినిమాలు కూడా అపట్లో మంచి హిట్స్ అందుకున్నాయి.