Most Watched Crime Series:లాక్ డౌన్ నుంచి ఓటీటీలకు ఆడియెన్స్ బాగా అలవాటు పడ్డారు. మరీ ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమాలు/వెబ్ సిరీస్‌కు మరింత ఆదరణ పెరిగింది. అలా మనవాళ్లు ఎక్కువగా చూసిన వెబ్ సిరీస్ లిస్ట్ లో ఇవే ఉన్నాయి.
- సెక్రెడ్ గేమ్స్- నెట్‌ఫ్లిక్స్: సినిమాలకు అయితే సెన్సార్ బోర్డ్ ఉంది కానీ, ఒకప్పుడు ఓటీటీకు సెన్సార్ బోర్డ్ ఉండేది కాదు. అలా సెన్సార్ లేని టైంలో వచ్చిన ఈ సెక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్ రెండు సీజన్లలో సెక్సువల్ కంటెంట్, హింస ఎక్కువగానే ఉంటుంది. కానీ, మనవాళ్లు చూసిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లిస్ట్‌లో ఇది టాప్‌లో ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో ఉంది.
- ది ఫ్యామిలీ మ్యాన్- ప్రైమ్ వీడియో:'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఈ లిస్ట్ లో రెండో స్థానంలో ఉంది. ఈ సిరీస్ రెండు సీజన్లుగా రూపొందింది. ఇందులో మనోజ్ భాజపాయ్, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ రెండు సీజన్లు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్నాయి. మూడో భాగం కూడా త్వరలో రానుంది.
- మిర్జాపూర్- ప్రైమ్ వీడియో:విపరీతమైన హింస, సెక్సువల్ కంటెంట్ ఉన్న ఈ సిరీస్‌కు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది. ఈ సిరీస్ కూడా రెండు సీజన్లుగా రూపొందింది. ఈ రెండు సీజన్లు ప్రైమ్‌లో స్ట్రీమింగ్కు అందుబాటిలో ఉన్నాయి. మరో సీజన్ కూడా త్వరలో రానుంది.
- దిల్లీ క్రైమ్- నెట్ ఫ్లిక్స్:నిర్భయ కేస్ ఆధారంగా వచ్చిన 'దిల్లీ క్రైమ్' వెబ్ సిరీస్ ఈ లిస్ట్‌లో తర్వాతి స్థానంలో ఉంది. రెండో సీజన్లో కచ్చా బనియన్ గ్యాంగ్ చేసిన ఆగడాలను చూపించారు. ఇది నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
- స్పెషల్ ఓపిఎస్- డిస్ని హాట్‌స్టార్: పార్లమెంట్ పై జరిగిన దాడి ఆపైన జరిగిన ఆపరేషన్ సెర్చ్ ఆధారంగా తెరకెక్కింది ఈ సిరీస్.
- అసుర్- జియో సినిమా: వరుస హత్యల ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.
- స్కామ్ 1992- సోని లైవ్:30 ఏళ్ల క్రిందట హర్షద్ మెహతా చేసిన భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆధారంగా దీనిని రూపొందించారు. అత్యధిక IMDB రేటింగ్ సంపాదించిన ఇండియన్ సిరీస్ ఇదే.