ETV Bharat / entertainment

'ఆయన చాలా డేంజరస్​' - షూటింగ్​లో ఇబ్బందులు బయటపెట్టిన పృథ్వీరాజ్! - Prithviraj Sukumaran About Prabhas - PRITHVIRAJ SUKUMARAN ABOUT PRABHAS

Prithviraj Sukumaran About Prabhas : 'సలార్‌ పార్ట్‌ 1'లో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ కలిసి నటించారు. అయితే ప్రభాస్‌తో కలిసి పని చేయడంలో తాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్‌ చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Prithviraj Sukumaran About Prabhas
Prithviraj Sukumaran About Prabhas (Getty Images, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 7:23 PM IST

Updated : Oct 1, 2024, 7:34 PM IST

Prithviraj Sukumaran About Prabhas : రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లో కూడా అభిమానుల మనసు గెలుచుకున్న స్టార్‌ హీరో ప్రభాస్‌. ఆయనతో కలిసి పని చేసిన నటులు కూడా ఇదే విషయం చెబుతుంటారు. మూవీ షూటింగ్‌ లొకేషన్‌లో ప్రభాస్‌ ఇచ్చే మర్యాద, ఆతిథ్యం చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. 'సలార్‌'లో ప్రభాస్‌తో కలిసి నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా రెబల్ స్టార్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్‌ చేసుకొన్నారు.

సలార్‌: పార్ట్ 1 సీజ్‌ఫైర్‌ ప్రమోషన్ సమయంలో ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళితో కలిసి ఓ చిట్‌చాట్‌ సెషన్‌లో పాల్గొన్నారు. ఇందులో రాజమౌళి పృథవీరాజ్‌ని ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అదేంటంటే, 'ప్రభాస్‌తో కలిసి పని చేయడంలో ఇబ్బంది పెట్టే అంశం ఏంటి?' దీనికి పృథ్వీరాజ్‌ ఏం చెప్పారంటే?

ప్రభాస్‌తో అలా చెబితే కష్టం!
రాజమౌళి ప్రశ్నకు పృథ్వీరాజ్ ఫన్నీగా స్పందించారు. "మీరు ప్రభాస్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అది నచ్చింది, నాకు ఇది నచ్చింది అని పొరపాటున కూడా అనకూడదు. నేను దేశంలో చాలా ప్రాంతాలు తిరుగుతూ షూటింగ్‌లో పాల్గొంటున్నాను. ఇంటికి వెళ్లి నా కార్లు నడిపి చాలా కాలమైందని ప్రభాస్‌తో అన్నాను. వెంటనే ప్రభాస్‌ నా లంబోర్ఘినిని ఇక్కడే ఉంచి వెళ్తాను. కొన్ని రోజులు వాడుకోండని చెప్పారు. నేను మనసులో ఆర్‌ యూ మ్యాడ్‌ అనుకున్నాను. ప్రభాస్‌ ఓ డేంజరస్‌ పర్సన్‌ సర్‌" అని రాజమౌళికి చెప్పారు.

ఆయన తినడు, మనకు వడ్డిస్తూనే ఉంటాడు
'సలార్‌' షూటింగ్ సమయంలో మరో సంఘటనను పృథ్వీరాజ్‌ గుర్తుచేసుకున్నారు. షూటింగ్‌ జరుగుతున్నప్పుడు పృథ్వీరాజ్‌ భార్య సుప్రియ, కుమార్తె అలంకృత కలవడానికి వచ్చారని, అప్పుడు ప్రభాస్ తన కుమార్తెని ఇష్టమైన ఆహారం ఏంటని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. సెట్స్‌లో ప్రభాస్‌ పంపిన ఫుడ్‌ ఉంచడానికి అదనపు గదిని తీసుకోవలసి వచ్చిందని వెల్లడించారు. "ప్రభాస్ సర్‌తో డైట్ చేయడం అసాధ్యం. అసలు సంగతి ఏంటంటే అతడు తినడు. చిన్న గిన్నెలో తింటాడు. మనకు మాత్రం వడ్డిస్తూనే ఉంటారు." అని పృథ్వీరాజ్ చెప్పారు.

'ప్రభాస్‌తో నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి!' : శ్రీదేవి విజయ్​ కుమార్​ - Sridevi Vijaykumar Prabhas

ప్రభాస్​ను అలా అస్సలు పిలవకూడదు! : చియాన్ విక్రమ్ - Chiyaan Vikram comments on Prabhas

Last Updated : Oct 1, 2024, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.