ETV Bharat / state

'రూ.లక్ష ఇస్తావా? - ఐదింతల పన్ను కడతావా?' - ACB CAUGHT BILL COLLECTOR HYDERBAD

అనిశాకు చిక్కిన బిల్‌ కలెక్టర్‌ - రూ.లక్ష ఇస్తే పన్ను తక్కువ చేస్తానని డిమాండ్ - రూ.45 వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన బిల్​ కలెక్టర్

ACB Cases Are Increasing In Telangana
ACB Arrests To GHMC Bill CollectorBharat (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 2:13 PM IST

ACB Arrests To GHMC Bill Collector : ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకునే వారిపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటుంది. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే వారిపై నిఘా పెట్టి ఆధారాలతో సహా వారిని అరెస్ట్‌ చేస్తుంది. ఎవరైనా అధికారులు లంచం తీసుకునేటప్పుడు దొరికితే అంతే సంగతులు. వారికి సంబంధించిన డేటా మొత్తం తీసి వారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. లంచాలు తీసుకున్న అధికారి ఆదాయం ఎంత? ఆదాయానికి మించి ఎన్ని ఆస్తులు ఉన్నాయని తెలుసుకొని కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా హైదరాబాాద్​లో ఓ బిల్ కలెక్టర్ రూ.45 వేల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడట్టారు.

అనిశాకు చిక్కిన బిల్‌ కలెక్టర్‌ : జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని మైలార్‌దేవుపల్లి వార్డు కార్యాలయంలో సోమవారం బిల్‌ కలెక్టర్‌ మధు, అతని అసిస్టెంట్‌ (ప్రైవేటు ఉద్యోగి) రమేష్‌ ఓ వ్యక్తి నుంచి రూ.45 వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు చిక్కారు. మధుబన్‌ కాలనీలో ప్లాస్టిక్‌ పరిశ్రమకు సంబంధించిన షెడ్డు నిర్మాణంలో ఉంది. దానికి ఆస్తి పన్ను సవరణ తర్వాత ఐదింతలు పెరుగుతుందని యజమానిని వీరిద్దరూ భయపెట్టారు.

రూ.లక్ష ఇస్తే పన్ను తక్కువ : రూ.లక్ష ఇస్తే ఆస్తి పన్ను తక్కువ చేస్తామని చెప్పారు. దీంతో బాధితుడు అనిశాను ఆశ్రయించాడు. సోమవారం వార్డు కార్యాలయానికి వచ్చి రూ.లక్ష ఇవ్వలేనని, రూ.45 వేలు చెల్లిస్తానని కోరాడు. వారు సరేనంటూ నగదు తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన అనిశా జిల్లా డీసీపీ ఆనంద్‌ కుమార్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

అటు ఏసీబీ దాడులు - ఇటు లంచం డిమాండ్‌ : బిల్‌ కలెక్టర్‌ను, అతని అసిస్టెంట్‌ను అనిశా పట్టుకొని విచారిస్తుంది. అదే సమయంలో పట్టణ ప్రణాళిక విభాగంలోని ఓ చిరుద్యోగి శివరాంపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం దగ్గరకు వెళ్లాడు. అనుమతి ఉన్నదాని కంటే అంతస్తు అదనంగా వేస్తున్నావంటూ రూ.50 వేలు డిమాండ్‌ చేశాడు. యజమాని తరఫున ఓ వ్యక్తి చరవాణిలో చిరుద్యోగితో మాట్లాడుతూ ఇప్పుడే ఓ అధికారి ఏసీబీకి చిక్కాడని తెలియజేశాడు. ఆ విషయం పక్కనబెట్టు ఎంత ఇప్పిస్తావో చెప్పు? అంటూ చిరుద్యోగి అనడం విశేషం. ఉన్నతాధికారులు వస్తే రూ.లక్షల్లో కట్టాల్సి వస్తుందని బెదిరించారు. చిరుద్యోగి మాటలు రికార్డు చేశామని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆ వ్యక్తి చెప్పాడు.

ఫార్ములా - ఈ కేసు వ్యవహరంలో ఎస్ నెక్ట్స్‌ కంపెనీకి ఏసీబీ నోటీసులు

'మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగారో - ఈ నంబర్​కు కాల్ చేయండి' - TOLL FREE NO FOR BRIBE COMPLAINTS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.