ETV Bharat / entertainment

బాలయ్య 'అన్​స్టాపబుల్' సీజన్ 4 -​ ఈ సారి ఎంటర్​టైన్మెంట్​ మామూలుగా ఉండదు! - Unstoppable Season 4 - UNSTOPPABLE SEASON 4

Unstoppable Season 4 : నందమూరి బాలకృష్ణ హోస్ట్​హా 'అన్​స్టాపబుల్' టాక్ షో సీజన్ 4 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి ఈ టాక్​ షోను మరింత గ్రాండ్​గా ప్లాన్​ చేస్తున్నారు.

Unstoppable Season 4
Unstoppable Season 4 (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 7:11 AM IST

Unstoppable Season 4 : నందమూరి నటసింహం బాలకృష్ణ 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్​ షో తో మరోసారి బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్​ఫుల్​గా కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో నాలుగో సీజన్​కు రంగం సిద్ధమైంది. 2024 అక్టోబర్ 24 నుంచి బాలయ్య 'అన్​స్టాపబుల్' సీజన్ 4 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రముక ఓటీటీ ప్లాట్​ఫామ్ ఆహా వేదికగా ఈ షో ప్రసారం కానుంది. బుల్లితెరపై ప్రేక్షకులకు అన్​లిమిటెడ్ ఎంటర్​టైన్​మెంట్​ పంచడానికి బాలయ్య రెడీ అవుతున్నారు.

నిర్వాహకులు ఈ సీజన్​ను గ్రాండ్​గా ప్లాన్ చేశారట. గత సీజన్ల కంటే ఈసారి భిన్నంగా ఉంటుందని తెలిసింది. ఏది ఏమైనా బుల్లితెరపై బాలయ్య ఎనర్జీని చూసేందుకు ఫ్యాన్స్​ కూడా ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ప్రతీ సీజన్​లాగే ఈసారి కూడా పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు గెస్ట్​లుగా రానున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ సీజన్​కు తొలి గెస్ట్​గా రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్​కు సంబంధించి షూట్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. ఈ సీజన్​లో దుల్కర్​తోపాటు మరికొంత మంది బడా స్టార్ల బాలయ్య 'అన్​స్టాపబుల్' షో లో సందడి చేయనున్నట్లు సమాచారం. కాగా, అన్​స్టాపబుల్ టాక్ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. గతంలో ఈ ప్రోగ్రామ్​కు టాలీవుడ్, బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల నుంచి బడా స్టార్లు గెస్ట్​లుగా వచ్చి సందడి చేశారు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, రవితేజ, విశ్వక్ సేన్, అడివి శేష్, సిద్ద జొన్నలగడ్డ తదితరులు పాల్గొన్నారు.

ఇక బాలకృష్ణ ప్రస్తుతం ఎన్​బీకే 109 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ విలన్​గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్​పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. తమన్నాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలపై టీమ్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం విజయ్‌ కార్తీక్‌ చూసుకుంటున్నారు.

బాలయ్య NBK 109 కోసం రాజస్థాన్‌ ఎడారి సెట్‌ - షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే? - NBK 109 Movie Rajasthan Set

'మహేశ్ బాబు'కు అవార్డు ఇద్దామనుకుంటున్నా- నా ఫేవరెట్ హీరో అతడే : బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.