ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: "రీలోడ్​ ఈవెంట్​" - వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​పై హింట్​ ఇచ్చిన నాగార్జున - ఎవరొస్తున్నారో తెలిసిపోయిందిగా!! - Wild Cards in Bigg Boss Season 8 - WILD CARDS IN BIGG BOSS SEASON 8

Bigg Boss 8: బిగ్‌బాస్ సీజన్ 8లో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్​ అయ్యింది!. దీనికి సంబంధించి నిర్వాహకులు ప్రోమో కూడా రిలీజ్​ చేశారు. అంతేకాదు ఎవరెవరు రాబోతున్నారనో.. వాళ్ల పేర్లు కూడా లీకయ్యాయి! మరి.. వాళ్లెవరో తెలుసా?

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2024, 6:50 PM IST

Wild Cards in Bigg Boss Season 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8.. అందరూ కోరుకున్నట్లుగా నాలుగో వారం సోనియా ఆకుల ఇంటి ​ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఆమె రీ ఎంట్రీ ఉంటుందా? వైల్డ్ కార్డు ఏంటి ద్వారా ఎంత మంది, ఎప్పుడు హౌస్​లోకి అడుగు పెట్టబోతున్నారు? అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగార్జున వీడియో ద్వారా వైల్డ్ కార్డు ఎంట్రీలపై అప్డేట్ ఇచ్చారు. మరి హౌజ్​లో వైల్డ్ కార్డుల ఎంట్రీ ఎప్పుడు జరగబోతోంది? తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఏముంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

సోనియాను హౌజ్​ నుంచి బయటకు పంపేసిన నాగార్జున.. ఆ తర్వాత ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని బాంబు పేల్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి అప్డేట్ ఇచ్చి మరోసారి బిగ్ బాస్ షో లవర్స్​కు షాక్​ ఇచ్చారు. ఊహించని విధంగా తాజా ప్రోమోలో వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి ప్రస్తావించారు. ఈ ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ 'ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతోంది. ఆడియన్స్ ఈ వారం బిగ్ బాస్ హౌజ్​లోకి వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 ఆన్ సండే.. గుర్తుంది కదా? ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ లేదు' అంటూ నాగార్జున చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

వచ్చేది వీళ్లేనట: సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న సమాచారం ప్రకారం.. మొత్తంగా 8 మంది వైల్డ్​ కార్డ్​ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అందులోనూ నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు జోడిలుగా ఎంటర్​ కానున్నారని టాక్​. గత ఏడు సీజన్లలో పార్టిసిపేట్​ చేసిన కంటెస్టెంట్లు ఉండబోతున్నారట. వాళ్లేవరో చూస్తే..

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

హరితేజ: ఎన్టీఆర్ హోస్ట్​గా వ్యవహరించిన బిగ్​బాస్ తెలుగు 1లో అవకాశం దక్కించుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్​గా మారి 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈ లేడీ ఇప్పుడు సీజన్​ 8లో పాల్గొననుందని సమాచారం.

రోహిణి: బిగ్​బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొన్న రోహిణి.. తన మార్క్ గేమ్​తో ప్రేక్షకులకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది. దీంతో తిరిగి సీజన్ 8లో కంటెస్ట్ చేయనుందట ఈ లేడీ కమెడియన్​.

అవినాష్​: బిగ్​బాస్​ సీజన్ 4 కంటెస్టెంట్స్​లో ముక్కు అవినాష్ ఒకరు. ఆ సీజన్​లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. అతడి బాడీ లాంగ్వేజ్, జోక్స్ నవ్వులు పూయించేవి. అవినాష్ అంచనాలకు మించి రాణించాడు. పది వారాలకు పైగా హౌజ్​లో ఉన్నాడు. అయితే ముక్కు అవినాష్ బిగ్​బాస్ తెలుగు సీజన్ 8లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అనేది తాజా న్యూస్.

రవి: యాంకర్​ రవి బిగ్​బాస్​ సీజన్​ 5లో పాల్గొన్నారు. అయితే ఆ సీజన్​లో రవిపై ప్రజల్లో నెగిటివిటీ పెరిగింది. దీంతో షో లో ఎక్కువ రోజులు లేడు. అయితే ఈ సీజన్​ 8 లో వైల్డ్​ కార్డ్​గా పాల్గొనేందుకు రవి పాజిటివ్​గా స్పందించినట్లు సమాచారం.

గౌతమ్ కృష్ణ: సీజన్​ 7లో పాల్గొన్న గౌతమ్​.. తొందరగానే ఎలిమినేట్​ అయ్యి సీక్రెట్​ రూమ్​కి వెళ్లాడు. ఆ తర్వాత వైల్డ్​ కార్డ్​ బ్యాచ్​తో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సీజన్​లో కూడా వైల్డ్​ కార్డ్​ ద్వారా హౌజ్​లోకి వచ్చేందుకు ఓకే చేసినట్లు టాక్​.

నయని పావని: సీజన్​ 7 లో వైల్డ్​కార్డ్​ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన నయని.. మొదటి వారంలోనే ఎలిమినేట్​ అయ్యింది. దీంతో ఈ సీజన్​లో మరోసారి వైల్డ్​కార్డ్​ ద్వారా ఇంట్లోకి వచ్చేందుకు సిద్ధమైందని టాక్​..

టేస్టీ తేజ: సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసిన మరొక కంటెస్టెంట్ టేస్టీ తేజ. ఎలాంటి అంచనాలూ లేకుండా అడుగుపెట్టిన టేస్టీ తేజా ఎంటర్టైనర్​గా పేరు తెచ్చుకున్నాడు. ఇతని పేరు సైతం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ లిస్ట్​లో ఉందని సమాచారం.

సోనియా ఆకుల: సీజన్​ 8లో బీభత్సమైన నెగిటివీ మూట కట్టుకుని నాలుగో వారం ఎలిమినేట్​ అయిన కంటెస్టెంట్​ సోనియా. అయితే ఈ బ్యూటీ కూడా మళ్లీ వస్తుందని సమాచారం..

వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ డేట్ అప్పుడే: ఈ సీజన్​లో "బిగ్​బాస్​ రీలోడ్​ ఈవెంట్"​ పేరుతో వైల్డ్​ కార్డ్​ ఎంట్రీలను హౌజ్​లోకి పంపించనున్నారు. ప్రోమోను బట్టి చూస్తుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ రానున్న ఆదివారం(అక్టోబర్​ 6) రోజున హౌజ్​లోకి అడుగు పెట్టే ఛాన్స్ ఉందనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. అంటే ఈ ఈవెంట్​ నవరాత్రుల స్పెషల్​గా అక్టోబర్​ 6వ తేదీన రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది. మరి ఆ ప్రోమో మీరు కూడా చూసేయండి!!

హౌజ్​మేట్స్​ కాపాడినా ప్రేక్షకులు కరుణించలేదు - మూడో వారం అభయ్​​ ఎలిమినేట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

బిగ్ బాస్ 8 : నాగమణికంఠ భార్య ఎవరో తెలిసిపోయిందిగా - పెళ్లి వీడియో వైరల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.