Home Remedies To Get Natural Pink Lips : 'చెలి అధరాలు లేత పూ రేకులు..'' దొండ పండు లాంటి పెదవే నీదీ.. అంటూ పెదాల అందాన్ని ఎందరో సినీకవులు వివిధ రకాలుగా వర్ణించడం మనం చూశాం. అయితే, అంత అందమైన పెదాలను అందంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే కదా? ఎండలో ఎక్కువగా తిరగడం, లిప్‌స్టిక్‌లు అతిగా వాడటం, కాఫీ, టీలు ఎక్కువసార్లు తీసుకోవడం... వాంటి వాటివల్ల పెదాలు నల్లగా మారిపోతుంటాయి. ఈ సమస్యను ఎలా అధిగమించాలి? నిపుణులు ఏం అంటున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోనే ఇలా ట్రై చేయండి : పెదాలపై కాస్త నలుపు తగ్గాలంటే బీట్‌రూట్ జ్యూస్, దానిమ్మ గుజ్జుతో పాటుగా కొత్తిమీర రసాన్ని రోజూ పెదాలపైన రాస్తూ ఉండాలని నిపుణలు చెబుతున్నారు. వీటిని వాడటం ద్వారా పెదాలు ఎర్రగా మారే అవకాశాలుంటాయంటున్నారు. దీంతో పాటు తేనె, నిమ్మరసం, గ్లిజరిన్ కలిపి రాసుకోవడం వల్ల నలుపు రంగు తగ్గుతుందని సూచిస్తున్నారు.
మాయిశ్చరైజేషన్ : పెదాలకు తగినంత తేమ లేకపోవడం వల్ల కూడా నల్లగా మారతాయంటున్నారు నిపుణులు. దీనికోసం లిప్ బామ్, బాదం నూనెని అప్లై చేయడం వల్ల పెదాలకు తగినంత తేమ అందుతుందని సూచిస్తున్నారు. దాంతో పాటు రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగితే మంచి ఫలితాలుంటాయని సూచిస్తున్నారు.
స్క్రబింగ్ : ఒక్క వేళ మీ పెదాలకు స్క్రబింగ్ ఏంటనుకుంటున్నారా? స్క్రబింగ్ అంటే చర్మానికి చేసినట్టు కాకున్నా 'ఎక్స్‌ఫోలియేషన్' చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అదెలా అంటే... మెత్తని బ్రిజిల్స్ ఉన్న బ్రష్ తీసుకోవాలి. పెదాలను కాస్త తడి చేసుకొని, ఆ తరువాత ఆ బ్రష్‌తో పెదాలను రుద్దాలి. తర్వాత లిప్ బామ్ రాసుకోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు చేయడం వల్ల పెదాలు అందంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
హెల్దీ డైట్ : పెదాలు ఆరోగ్యంగా కనిపించాలంటే మీరు తినే ఆహారం మీద కూడా దృష్టి సారించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. ఖర్జూరాలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తీసుకోవడమూ మంచిదని, దీనికోసం ఒక కప్పు వేడినీటిలో ఆరు ఖర్జూరాలను నానబెట్టి అరగంట పాటు ఉంచుకోవాలి. తర్వాత ఆ నీళ్లను తాగితే మీ పెదాలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఎండ నుంచి కాపాడుకోండి : పెదాలు నల్లబడటానికి ఎండ కూడా ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. అందుకే మీ పెదాలను ఎండ నుంచి కాపాడుకోవాలిని సూచిస్తున్నారు. సన్‌స్క్రీన్ లోషన్‌ని వాడాలని.. ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడం, వెళ్లాల్సి వస్తే స్కార్ఫ్ లాంటివి ఉపయోగించడం వల్ల పెదాలు నల్లగా మారకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కాంతివంతమైన ఫేస్ కోసం 'కాఫీ స్క్రబ్'- ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం! - How to Make Coffee Mask