ETV Bharat / entertainment

'గేమ్ ఛేంజర్' సాలిడ్ అప్డేట్ - టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన తమన్ - Game Changer Teaser - GAME CHANGER TEASER

Game Changer Teaser : రామ్​చరణ్​ లీడ్ రోల్​లో నటించిన 'గేమ్ ఛేంజర్' నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమా టీజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేశారు.

Game Changer teaser
Game Changer teaser (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 7:40 AM IST

Updated : Oct 2, 2024, 8:56 AM IST

Game Changer Teaser : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్​ లీడ్ రోల్​లో నటించిన 'గేమ్ ఛేంజర్' నుంచి రీసెంట్​గా 'రా మచ్చ' పాట రిలీజైంది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పాట విడుదల సందర్భంగా నిర్మాత దిల్ ​రాజు డిసెంబర్ వరకు వరుసగా అప్డేట్స్ ఉంటాయని చెప్పి ఫ్యాన్స్​లో జోష్ నింపారు.అక్టోబర్​లో మరో సాంగ్, టీజర్ రానున్నాయని దిల్​రాజు అన్నారు. అటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అంచనాలు పెంచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమన్, ఓ అభిమాని ట్వీట్​కు రిప్లై ఇస్తూ మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ 'దసరా' పండగ సందర్భంగా విడుదల కానుందని హింట్ ఇచ్చారు. 'తమన్ అన్నా టీజర్ ఎప్పుడు అన్నా. బీజీఎమ్ అదరగొట్టి ఉంటావ్ మాకు నమ్మకం ఉంది' అని ఓ ఫ్యాన్ తమన్​ను ట్యాక్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి 'దసరా 2024' అని ఆయన రిప్లై ఇచ్చారు. దీంతో టీజర్ మరో 10 రోజుల్లో (అక్టోబర్ 12) రానున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక తాజా అప్డేట్​తో ఫ్యాన్స్ కూడా థ్రిల్ అవుతున్నారు.

కంటిన్యూగా ప్రమోషన్స్
అనంత్ శ్రీరామ్​తో ఇటీవల జరిగిన చిట్​చాట్​లో నిర్మాత దిల్​రాజు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను 2024 క్రిస్మస్​కు థియేటర్లలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు దిల్​రాజు తెలిపారు. ఇకపై అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లో వరసగా మూవీ ప్రమోషన్స్ చేస్తామని ఆయన అన్నారు.

కాగా, సీనియర్ డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించింది. సీనియర్ నటులు యస్​ జే సూర్య, అంజలీ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందించారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్​పై దిల్​రాజు భారీ బడ్జెట్​తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ ఆఖరి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

గేమ్​ఛేంజర్ సాలిడ్​ అప్డేట్- టీజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేశారుగా! - Game Changer Update

'గేమ్​ఛేంజర్' కొత్త పోస్టర్ రిలీజ్- ఈసారి అప్డేట్ ఏంటంటే? - Game Changer Update

Last Updated : Oct 2, 2024, 8:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.