Most Expensive Weddings : ఒకప్పుడు రాజుల కాలంలో 5 రోజుల పాటు పెళ్లిళ్లు అట్టహాసంగా జరిగేవి. 400 ఏళ్ల క్రితమే షాజహాన్ తన కుమారుడు దారాషికో వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించాడు. ఇది మొఘల్ చరిత్రలో గొప్ప పెళ్లి అని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ పెళ్లి కోసం షాజహాన్ రూ.32లక్షల ఖర్చు చేశారట. అంటే ఇప్పటి కాలంలో వేల కోట్లతో సమానమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా తన కుమారుడు, కూతురు వివాహం ఎంతో ఘనంగా జరిపించారు. ఇప్పుడు చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం కూడా ఓ రేంజ్ లో జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఇంత ఘనంగా పారిశ్రామిక వేత్తలే కాదు సెలబ్రెటీల పెళ్లిళ్లు జరిగాయి. వేల కోట్లలో ఖర్చు చేసి మరి చేసుకున్నారు. కళ్లు చెదిరిపోయే డెకరేషన్లు, అదిరిపోయే వెడ్డింగ్ డెస్టినేషన్లు, రాజమహల్స్కు తీసిపోని వివాహ వేదికలు ఇలా ఓ రేంజ్ లో ఉంటుంది హడావిడి. మరి అత్యంత ఖరీదైనా పెళ్లిళ్లు ఎవరూ చేసుకున్నారు. ఎంత ఖర్చు చేశారో చూద్దాం.
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ : ఈ బాలీవుడ్ జంట రాజస్థానలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో నాలుగు రోజుల పాటు జరిగాయి. అయితే ఈ పెళ్లికి ఏకంగా రూ.4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా: ఈ బాలీవుడ్ క్యూట్ జంట వివాహం రాజస్థాన్‌లోని సూర్యగడ్ ప్యాలెస్ జరిగింది. రోజు రూ. 2 కోట్లు చొప్పున మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడకకు రూ. 6 కోట్లు ఖర్చు చేశారు.ఇది కేవలం పెళ్లికి, డెకరేషన్స్ కోసం పెట్టిన ఖర్చు మాత్రమే.
ఆలియా భట్, రణబీర్ కపూర్ : ఈ జంట బాంద్రాలోని తమ ఇంట్లోనే పెళ్లి చేసుకున్నారు. అయినప్పుటికీ ఖర్చులో ఏ మాత్రం తగ్గలేదు. రూ.10 కోట్లతో ఘనంగా చేసుకున్నారు.
దీపికా, రణవీర్ సింగ్ : బాలీవుడ్ లవ్ బర్డ్స్ డిస్టినేషన్ పెళ్లి చేసుకున్నారు. ఇటలీ జరిగిన ఈ పెళ్లికి రూ.77 కోట్లు ఖర్చు చేశారు.