Mokshagna Debut Film Producer : నందమూరి బాలకృష్ణ వారసత్వం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందంటేనే ఒక సెన్సేషన్. బాలయ్య క్రేజ్ దృష్టిలో ఉంచుకుని ఆయన తనయుడు తొలి సినిమా అనేసరికి భారీ అంచనాలు పెట్టేసుకున్నాయి సినీ వర్గాలు. ఆ ఎంట్రీ సినిమా గురించి ఏ అప్‌డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. రీసెంట్‌గా మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అవ్వనున్న సినిమాకు ఇటీవల 'హనుమాన్' సినిమాతో సక్సెస్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరక్షన్ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
అయితే ఈ సినిమా నుంచి మరో కీలక అప్‌డేట్ తాజాగా బాలయ్యనే స్వయంగా వెల్లడించారు. అదేంటంటే ఈ చిత్రానికి తన కుమార్త తేజస్వినీనే ప్రొడ్యూస్ చేయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్టోబరులో మొదలుపెట్టాలనుకుంటున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. డైరక్టర్, ప్రొడ్యూసర్ దాదాపు కన్ఫమ్ అయిపోగా మిగిలిన నటీనటులు ఎవరనేది తెలుసుకునేందుకు కొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు మరి.