తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మోహన్​లాల్​కు సోకిన ఆ ఇన్ఫెక్షన్​ - అలా చేయాలని డాక్టర్లు సూచన! - Mohanlal Health Condition - MOHANLAL HEALTH CONDITION

Mohanlal Health Condition Update : తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్య, కండరాల నొప్పితో బాధపడుతున్న స్టార్ హీరో మోహన్ లాల్ హెల్త్​ అప్డేట్​ న్యూస్​ బయటకు వచ్చింది. డాక్టర్లు ఏం చెప్పారంటే?

source ETV Bharat
Mohanlal Health Condition Update (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 10:17 AM IST

Updated : Aug 19, 2024, 10:36 AM IST

Mohanlal Health Condition Update :మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్య, కండరాల నొప్పితో ఆయన బాధపడుతున్నారని, ప్రస్తుతం కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు మలయాళ మీడియా పేర్కొంది. అయితే తాజాగా ఆయన హెల్త్‌కు సంబంధించి సదరు ఆస్పత్రికి చెందిన వైద్యులు చేసిన ప్రకటన వైరల్‌ అవుతోంది.

మోహన్​ లాల్​ హై గ్రేడ్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు భావిస్తున్నారట. అందుకే ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారట. ప్రస్తుతం ఈ హెల్త్ బులెటిన్​ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కానీ దీనిపై అధికార ప్రకటన రాలేదు.

దీంతో మోహన్‌ లాల్‌ ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

కాగా, మోహన్ లాల్​ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన బరోజ్‌(Mohan lalBarroz Movie) అక్టోబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి మోహన్‌ లాల్‌ శనివారం పోస్ట్‌ కూడా పెట్టారు. 'తన రహస్యాలను మీ అందరితో పంచుకోవడం కోసం 'బరోజ్‌' వచ్చేస్తున్నాడు. మీ అందరూ సిద్ధంగా ఉండండి" అని రాసుకొచ్చారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Mohan Lal Donates 3 Crores wayanad landslides : ఇకపోతే రీసెంట్​గా వయనాడ్‌‌లో ప్రకృతి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడడం వల్ల వందలాది మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అలాంటి భారీ విపత్తు సమయంలో భారత సైన్యంతో కలిసి లెఫ్టినెంట్​ కల్నల్​ హోదాలో ఉన్న మోహన్ లాల్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే బాధితుల కోసం రూ. 3 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

'వయనాడ్' బాధితులకు మోహన్​లాల్​​ రూ.3 కోట్లు విరాళం - Actor Mohanlal In Wayanad

మోహన్‌లాల్‌కు అస్వస్థత- హాస్పిటల్​లో ట్రీట్​మెంట్!

Last Updated : Aug 19, 2024, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details