Ramcharan New Rolls Royce Car :మెగా హీరో రామ్ చరణ్ RRR తర్వాత గ్లోబర్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆయన క్రేజ్ వరల్డ్ వైడ్‌గా పెరిగిపోయింది. త్వరలోనే గేమ్ ఛేంజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్‌గానే తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను కూడా పూర్తి చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు, సుకుమార్‌తోనూ సినిమాలు చేయనున్నారు చరణ్. తన ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలను తెరకెక్కించనున్నారు.
అయితే రామ్ చరణ్ దగ్గర ఎన్నో లగ్జరీ కార్లు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన గ్యారేజ్‌లోకి మరో విలాసవంతమైన, ఖరీదైన కారు వచ్చి చేరిందని తెలిసింది! అదేంటంటే రోల్స్ రాయిస్. ఈ బ్రాండ్‌కు సంబంధించిన కార్లు చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ కారు ఉంది. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కూడా రోల్స్ రాయిస్ కారును కొన్నారని తెలిసింది. రోల్స్ రాయల్ లేటెస్ట్ వెర్షన్ స్పెక్ట్రా కారును తీసుకున్నారట. దీని ధర దాదాపు రూ. 7.5 కోట్లు అని సమాచారం అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ముంబయిలో జరుగుతున్న అనంత్ అంబానీ పెళ్లికి బయలు దేరారు. అందుకోసం తన కొత్త కారు రోల్స్ రాయిస్‌లో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. తానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చి స్టైలిష్ ఎంట్రీతో కారు దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు చూసిన మెగా ఫ్యాన్స్ చరణ్ ప్రెజెన్స్, ఛార్మ్ చూసి ఫుల్ ఫిదా అయిపోతున్నారు. మినీ సైజ్ మువీ చూపించావ్ కదన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోకు ఓజీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జత చేసి తెగ షేర్ చేస్తున్నారు.