Mega Heroes Latest Upcoming Movies : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఒక్క కుటుంబం నుంచే దాదాపు తొమ్మిది మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి రాణిస్తున్నారు. త్వరలోనే మరో మెగా వారసుడు పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా రాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదుగురు హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అది కూడా ఒక సినిమా రిలీజైన 20 రోజులకు మరో సినిమాతో, అది విడుదలైన 20 రోజులకు మరో చిత్రంతో ఇలా వరుసగా రానున్నారు!
సాధారణంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో సినిమా వస్తుందంటే మెగా అభిమానుల్లో భారీ స్థాయిలో సందడి ఉంటుంది. మరి అలాంటిది మెగా హీరోలు వరుసగా క్యూ కడుతూ తమ సినిమాలను రిలీజ్ చేస్తే, అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. పండగ సంబరాలు చేసుకుంటుంటారు.
అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ మొదలుకుని రామ్ చరణ్, పవన్ కల్యాణ్ వరకు ఇలా వరుసగా ఐదు మంది మెగా హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి క్యూలో నిలబడ్డారు. మరి ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందంటే?
Varun Tej Matka Release Date : వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా'. కరుణ కుమార్ దర్శకుడు. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజినీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో హై బడ్జెట్ మూవీగా ఇది రూపొందుతోంది. నవంబర్ 14వ థియేటర్లలోకి విడుదల కానుంది.
Pushpa 2 Release Date :సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రానున్న చిత్రం 'పుష్ప 2'. చాలా కాలం నుంచి ఊరిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్‌ను జరుపుకుంటోంది.