ETV Bharat / entertainment

'అల్లు అర్జున్​తో నన్ను పోల్చకండి'- అమితాబ్ సెన్సేషనల్ కామెంట్స్​! - AMITABH BACHCHAN ON ALLU ARJUN

అల్లు అర్డున్​పై మరోసారి బిగ్​ బీ ప్రశంసలు- ఆయనతో పోల్చవద్దని కామెంట్స్!

Amitabh Bachchan On Allu Arjun
Amitabh Bachchan On Allu Arjun (Source : ETV Bharat, Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 16 hours ago

Amitabh Bachchan On Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​పై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. అర్జున్ గొప్ప ప్రతిభావంతుడని అమితాబ్ అన్నారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' షో లో ఓ కంటెస్టెంట్​తో బన్నీ గురించి అమితాబ్ మాట్లాడారు.

ప్రస్తుతం 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' ప్రోగ్రామ్ 16వ సీజన్ ప్రసారమవుతోంది. ఈ షో తాజా ఎపిసోడ్​కు కోల్​కతాకు చెందిన ఓ గృహిణి కంటెస్టెంట్‌గా వచ్చారు. షో లో భాగంగా ఆమె మాట్లాడుతూ, తనకు అల్లు అర్జున్‌, అమితాబ్‌ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. దీనికి బిగ్ బీ స్పందించారు. 'అల్లు అర్జున్‌ తనకు వచ్చిన గుర్తింపులన్నిటికీ పూర్తి అర్హుడు. నేను కూడా బన్నీకి వీరాభిమానిని. ఇటీవల అతడు నటించిన 'పుష్ప: ది రూల్‌' సినిమా మంచి విజయం సాధించింది. మీరు ఆ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. తను ఎంతో టాలెంటెడ్ యాక్టర్. అతడితో నన్ను పోల్చవద్దు' అంటూ బిగ్ బీ సరదాగా అన్నారు.

అమితాబ్ కామెంట్స్​కు ఆ కంటెస్టెంట్‌ స్పందిచారు. పలు సీన్స్​లో ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుందని అన్నారు. 'కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదో ఒకరోజు అల్లు అర్జున్‌ను చూస్తే నా కల నెరవేరుతుంది' అని చెప్పారు.

మా ఇన్సిపిరేషన్ మీరే
ఇక ఇటీవల 'పుష్ప 2' ప్రమోషన్స్​లో భాగంగా ముంబయిలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ, తనకు అమితాంబ్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్‌గా ఉన్నారని, అనేక మంది నటీనటులకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. అమితాబ్‌ సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన వీడియోను అమితాబ్ షేర్‌ చేశారు. అల్లు అర్జున్ పని తీరుకు తాను అభిమానినని పోస్ట్‌ పెట్టారు. తాను ఇంకా ఎన్నో మంచి విజయాలు అందుకోవాలని కోరారు. దీనికి బన్నీ రిప్లై ఇచ్చారు. 'మీరు మా సూపర్‌ హీరో. మీనుంచి ఇలాంటి ప్రశంసలు నమ్మలేకపోతున్నా. నాపై మీకున్న ప్రేమకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారు.

'ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు- అందుకే ఆ అమితాబ్​ సినిమా అంటే నాకిష్టం లేదు' - కమల్ హాసన్

సక్సెస్​ఫుల్​గా 'థ్యాంక్యూ ఇండియా' ప్రెస్ మీట్​ - వాళ్లకు బన్నీ ప్రత్యేక ధన్యవాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.