Varun Tej About Mega Family: మెగా హీరో వరుణ్ తేజ్- మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'మట్కా'. డైరెక్టర్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ మీనాక్షితో కలిసి వరుణ్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అందులో మెగా ఫ్యామిలీ గురించి, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తో తనకున్న బాండింగ్ గురించి షేర్ చేసుకున్నారు. అల్లు, కొణిదెల ఫ్యామిలీలకు చిరంజీవి హెడ్ మాస్టర్ లాంటివారని వరుణ్ అన్నారు. ప్రతి ఆదివారం మీటింగ్ పెట్టి అందర్నీ కలిసేలా చేసేవారని చెప్పుకొచ్చారు. అలాగే చిన్నప్పుడు బన్ని, చరణ్‌తో ఉన్న బాండింగ్ గురించి కూడా గుర్తుచేసుకున్నారు.
'మేమంకా ఒకే ఇంట్లో పెరిగాం. అందుకే చరణ్ అన్నతో నాకు కాస్త చనువు ఎక్కువ. నాకు ఏదైనా సమస్య తలెత్తితే ముందు గుర్తొచ్చే వ్యక్తి చరణ్. ఇప్పుడు ఎవరి కెరీర్లో వాళ్లు బిజీ అయిపోయాం. అందుకే కలవడం కుదరడం లేదు. ఒక్కోసారి ఒకరినొకరం చూసుకోకుండానే నెలలు గడిచిపోతున్నాయి. అయితే మేం ఎక్కడ ఉన్నా, పెదనాన్న సంక్రాంతికి గ్రాండ్‌గా నిర్వహించే ఈవెంట్‌కు వెళ్తాం. 3-4 రోజులు అక్కడే బాగా ఎంజాజ్ చేస్తాం. మా చిన్నప్పుడు అయితే ఆయన ప్రతి సండే మీటింగ్ పెట్టేవారు. మేమంతా అక్కడ కలిసేవాళ్లం'