Manjummel Boys Box Office Collection : చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది మలయాళ మూవీ 'మంజుమ్మెల్ బాయ్స్'. వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌తో పాటు ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజైన రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. రిలీజైన 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును దాటి మాలీవుడ్‌లో ఈ మార్కును ఫాస్ట్‌గా దాటిన సినిమాగా చరిత్రకెక్కింది. మరోవైపు మలయాళంతో పాటు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని సమచారం. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు.
Manjummel Boys Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే - చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరీ 22న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భసి, బాలు వర్గీస్, గణపతి, సీనియర్ నటుడు లాల్, అరుణ్ కురియన్, ఖలిడ్ రెహ్మాన్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, షెబిన్ బెన్సన్, లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు.