తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Updated : 6 hours ago

ETV Bharat / entertainment

రజనీకాంత్‌ 'వేట్టాయన్‌' సెన్సార్‌ రిపోర్ట్ ఇదే - ఆ మూడు డైలాగ్స్​పై అభ్యంతరం - Vettaiyan Movie Sensor

Rajinikanth Vettaiyan Movie Sensor : సూపర్ స్టార్ రజనీ కాంత్‌ ప్రధాన పాత్రలో రూపొందిన 'వేట్టాయన్‌' సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Rajinikanth Vettaiyan (source ETV Bharat)

Rajinikanth Vettaiyan Movie Sensor :దసరా కానుకగా బాక్సాఫీసు ముందుకు రానున్న సినిమాల్లో 'వేట్టాయన్‌' కూడా ఒకటి. ఈ పండగ బరిలో దిగబోతున్న సినిమాల్లో ఇదే పెద్దది. సూపర్ స్టార్ రజనీ కాంత్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం అక్టోబరు 10న థియేర్లలో రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుందీ చిత్రం. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్‌: 163.25 నిమిషాలు (2 గంటల 43 నిమిషాల 25 సెకన్లు). అయితే మూడు డైలాగ్స్​పై సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాటిని మ్యూట్‌ చేయడమో, లేదా వేరే పదాలు వినియోగించడమో చేయాలని మూవీ టీమ్​కు సూచించింది.

కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్​, విలక్షణ నటులు ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంజు వారియర్​ మరో కీలక పాత్రలో కనిపించనుంది. జై భీమ్‌ వంటి భారీ విజయం తర్వాత టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది.

Manasilayo Song : ఆ మధ్య సినిమా నుంచి విడుదలైన 'మనసిలాయో' సాంగ్​ కూడా విడుదలై మంచి విశేష ఆదరణను అందుకుంది. ఇందులో మంజు వారియర్ గ్లామర్, వేసిన డ్యాన్స్ స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే పాట కనిపిస్తోంది.

ఈ మధ్యే రజనీ కాంత్ కూడా వేట్టాయన్ సినిమా గురించి మాట్లాడారు. "మా మూవీ షూటింగ్ పూర్తైంది. మా బాధ్యతను మేం పూర్తిగా నిర్వర్తించాం. ఇక ఆడియెన్స్​ మా సినిమా చూసి ఎలా ఉందనే విషయం చెప్పాలి. ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ స్థాయిలో సినిమాను తీర్చిదిద్దాము. మా మూవీ నుంచి విడుదలైన మనసిలాయో ఇప్పటికే మంచి రెస్పాన్స్​ను అందుకుంది. ఆ పాట అంత మంచిగా రావడానికి కొరియోగ్రాఫర్ దినేశే ప్రధాన కారణం." అని రజనీకాంత్‌ పేర్కొన్నారు.

ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌ - ఏమైందంటే? - Rajnikanth Hospitalized

ఆయన ఇల్లు వేలం - బాలీవుడ్‌ మొత్తం నవ్వుకుంది! ఇప్పుడేమో : రజనీ ఎమోషనల్ స్పీచ్ - Rajinikanth Emotional Speech

Last Updated : 6 hours ago

ABOUT THE AUTHOR

...view details