తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

SSMB 29 కోసం రాజమౌళి షాకింగ్ రెమ్యునరేషన్​! - Rajamouli Remuneration

Mahesh Babu SSMB 29 Rajamouli Remuneration : మహేశ్ SSMB 29 కోసం రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఓ అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు.

SSMB 29 కోసం రాజమౌళి షాకింగ్ రెమ్యునరేషన్​!
SSMB 29 కోసం రాజమౌళి షాకింగ్ రెమ్యునరేషన్​!

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 12:48 PM IST

Updated : Mar 17, 2024, 1:03 PM IST

Mahesh Babu SSMB 29 Rajamouli Remuneration :దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రతి ప్రేక్షకుడికి తెలిసే ఉంటుంది. చివరిగా ఆర్​ఆర్​ఆర్ చిత్రంతో​ హాలీవుడ్​ రేంజ్​లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఫారెస్ట్​ అడ్వెంచర్ బ్యాక్​డ్రాప్​తో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్​తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని అంటున్నారు.

అయితే ఓ ప్రాజెక్ట్​ కోసం బడా స్టార్స్ అంతా భాగస్వామ్యం అవుతున్నారంటే ఆ సినిమాపై వచ్చే హైప్ వేరే లెవల్​లో ఉంటుంది. ఆ చిత్రానికి సంబంధించి ఏ వార్తైనా ఆడియెన్స్​లో క్యూరియాసిటీని పెంచుతూ ఉంటుంది. సినిమా కథేంటి? ఎలా ఉండబోతుంది? ఎవరెవరు నటిస్తున్నారు? వారి పారితోషికం ఎన్ని కోట్లు? ఇలా ప్రతీది ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా ఈ అత్యంత భారీ బడ్జెట్​ మూవీ కోసం రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్​ గురించి ఓ వార్త ఒకటి బయటకు వచ్చింది.

అదేంటంటే ఈ SSMB 29 కోసం జక్కన్న ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదని సమాచారం అందింది. దీనికి బదులుగా ఏకంగా సినిమాలో వాటా తీసుకోబోతున్నారట. అంటే ఈ లెక్కన చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించే వారి కన్నా ఎక్కువగా ఉంటుందన్న మాట. ఇకపోతే మహేశ్ కూడా ఈ SSMB 29 కోసం భారీగా వసూలు చేస్తున్నారని తెలిసింది. పారితోషికంతో పాటు లాభాలు కూడా తీసుకుంటారని బయట కథనాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు ప్రస్తుతం దీని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

ఇకపోతే ఇండియన్‌ సినిమానే చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రం కోసం దర్శకధీరుడు ఆవిష్కరించబోతున్నారు. సినిమాలో పలువురు విదేశీ నటులు కూడా​ నటించబోతున్నారని తెలిసింది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు మహారాజ్‌(Mahesh Babu Rajamouli Movie title Maharaj) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. మహేశ్​ లుక్‌కు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్​ను జక్కన్న బృందం సిద్ధం చేసిందని కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి.

రాజమౌళి చెప్పిన ఆ ఒక్క మాట - ఇప్పటికీ పాటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్​!

ఓటీటీలోకి వచ్చేసిన 'హనుమాన్'​ - అక్కడ ఫ్రీగా చూసేయొచ్చు!

Last Updated : Mar 17, 2024, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details