Mahesh Babu Namratha : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారనే చెప్పాలి. అయితే వరుస హిట్లను అందుకుంటూ పోతున్న ఆయన అభిమానులకు రీసెంట్గా వచ్చిన గుంటూరు కారం చిత్రం మాత్రం కాస్త నిరాశపరిచింది. అయితే వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి.
ప్రస్తుతం మహేశ్ బాబు తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి SSMB29 భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ చేయబోతున్నారు. ఇప్పటికే కథ కూడా రెడీ అయిపోయింది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
అయితే తాను కెరీర్లో ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనక తన భార్య ప్రోత్సాహం కూడా ఉందని పలు సందర్భాల్లో మహేశ్ చెప్పారు కూడా. ఆమె మహేశ్ బాబును పెళ్లి చేసుకున్నాక నటనకు గుడ్ బై చెప్పి సంపూర్ణ గృహిణిగా మారిపోయింది. ఓవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకుంటూనే ఇంకోవైపు భర్తకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటోంది. మహేశ్‌కు సంబంధించి అన్ని పనులు దగ్గరుండి మరీ చూసుకుంటోంది. ఆయన నిర్మాణ సంస్థను, వ్యాపారాలను, సేవా సంస్థలను హ్యాండిల్ చేస్తోంది.