Kubera Dhanush in Garbage:ఏ మూవీలో నటించినా తను నటించిన పాత్ర మాత్రమే కనిపించేలా చేయడం తమిళ్ స్టార్ హీరో ధనుశ్ ప్రత్యేకత. అయితే తన కారెక్టర్ కోసం ధనుశ్ ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' షూటింగ్లో కూడా ధనుశ్ ఇలాంటి సాహసమే చేశారు. నేచురాలిటీ కోసం ఓ సీన్‌ను నిజంగానే ముంబయిలోని అత్యంత పెద్ద డంప్‌యార్డ్‌లో షూటింగ్ చేశారట. ఆ సీన్స్ సహజంగా రావడం కోసం ధనుశ్ 10 గంటల పాటు మాస్క్ కూడా లేకుండా డంప్‌యార్డ్‌లో నటించారని తెలిసింది.
అయితే సినిమాలో ధనుశ్ పాత్ర కోసం ఆయన దీన స్థితిలో ఉన్నాడని రియాల్టీకి దగ్గరగా చూపించడం కోసం ఈ సీన్ అక్కడ షూటింగ్ చేశారు. 10 గంటల పాటు కనీసం మాస్క్ కూడా ధరించకుండా ధనుశ్అక్కడ తన షెడ్యూల్ పూర్తి చేశారు. అక్కడ ఘాట్ చేసిన సీన్ అద్భుతంగా చాలా సహజంగా వచ్చిందని ఆ మూవీ టీం పేర్కొంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.